Venkatesh : వెంకటేష్ అసలు పేరు తెలుసా.. ఆయన పేరు వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఇదే..!
Venkatesh : టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన సినిమాలకి మినిమం గ్యారెంటీ ఉంటుంది. మంచి కథలు ఎక్కడ ఉన్న వెతికి పట్టుకోవడంలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ తర్వాతే ఎవరైనా. ఆల్రెడీ రీమేక్ రాజాగా ఈ బొబ్బిలి రాజాకు మంచి ఇమేజ్ ఉంది. ఎన్నో రీమేక్‌లను తెలుగులోకి అనువదించి మంచి సక్సెస్‌లు సాధించాడు. గతేడాది వెంకటేష్ థియేటర్స్‌లో కాకుండా ‘నారప్ప’, ‘దృశ్యం 2’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలు వేరే భాషలో హిట్టైన సినిమాలు కావడం విశేషం. ఈ కోవలోనే ఈయన వేరే భాషలో హిట్టైన ఓ సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మలయాళంలో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ గురించి కొన్ని వార్తలు సోషళ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వెంకటేష్ అసలు పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. ఇది వెంకటేష్ తాతగారి పేరు. రామా నాయుడు గారికి తండ్రి మీద, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి మీద ఉన్న భక్తితో ఈ పేరు పెట్టారు. చెన్నైకి వచ్చాక స్కూల్లో జాయిన్ అయినప్పుడు కొన్ని కారణాలవల్ల స్కూల్ రికార్డుల్లో వెంకటేశ్వర్లు కాస్త వెంకటేష్ గా మారింది. అయితే వెంకటేష్ కు తన అసలు పేరు అంటే ఎంతో ఇష్టం.
Venkatesh : ఇదీ సంగతి..
ఇప్పటికీ ఆయన తన సినిమాలలోని పాత్రలకు వెంకటేశ్వర్లు ఉండేలా చూసుకుంటారు. వెంకటేశ్వర్లు పేరుతో నటించిన సినిమాలు అన్ని ఆయనకు విజయాన్ని అందించాయి. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మేనకోడలు నీరజను పెళ్లాడిన వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు.. ఓ కుమారుడు ఉన్నారు. కాగా, వెంకటేష్ F2 సినిమాకు సీక్వల్‌గా రాబోతున్న F3 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు మేకర్స్. ”పిల్లలు పరీక్షలు ముగించుకోండి. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి. ఫన్ పిక్నిక్‌కి డేట్ ఫిక్స్ చేశాం” అంటూ F3 మూవీ విడుదల తేదీ ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.