bad time running for megastar chiranjeevi one more flap for him
Chiranjeevi : టాలీవుడ్ లో చిరంజీవి ఇప్పుడు ఎప్పుడు నెంబర్ వన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సుదీర్ఘమైన సినీ చరిత్రలో ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కూడా ఆయనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజకీయాల కారణంగా ఎన్నో సినిమా ఇండస్ట్రీలో ఇక ముందు పట్టించుకోరు అని కొందరు భావించినా అది నిజం కాదు అని ఆయన తిరిగి తన పూర్వ వైభవమును రీఎంట్రీ ఇచ్చి చాటుకున్నాడు. కానీ వయసు మీద పడటం లేదా మరి ఏంటో కానీ ఆయన తనకున్న స్టార్ డం ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అంటూ స్వయంగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
పైగా ఈ మధ్య కాలంలో ఆయనకు గడ్డు కాలం నడుస్తుంది అనిపిస్తుంది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాలు అభిమానులు వెయిట్ చేశారు. ఆ సినిమా కాస్త బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఆ సినిమా డిజాస్టర్ తో చిరంజీవి తన వరుస సినిమాల జోరును కాస్త ఆపేశాడు. ఇటీవలే అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సమర్పించాడు. చిరంజీవి సెంటిమెంట్ తో ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక బోర్ల పడింది.
bad time running for megastar chiranjeevi one more flap for him
ఆచార్య సినిమా ఫ్లాప్ నుండి తేరుకుంటున్న చిరంజీవికి లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ మరింత ఇబ్బంది పెట్టింది. ఇదే సమయంలో ఆయన ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మెగాస్టార్ చిరంజీవి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అంటూ ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఆయన పూర్వ వైభవాన్ని చాటుకోవడం ఖాయం.. ఎలాంటి ఇబ్బందులు ఆయన.. ఆయన ఎదుర్కొని నిలుస్తాడు అని అంతా ధీమాగా ఉన్నారు.
AIYF : యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని, మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత…
Bhuma Akhila Priya : ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాజాగా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అహోబిలంలో…
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద పేదలకు గృహాలు అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా రాష్ట్ర కాంగ్రెస్…
Ambati Rambabu : జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి అంబటి…
Pawan Kalyan : అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
New Ration Cards : ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఎట్టకేలకు ఊరట…
హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని, గణపతి ఆలయ దర్శనం,…
Today Gold Price : భారతీయుల్లో బంగారం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా మహిళలకైతే పసిడిపై అపారమైన ప్రేమ…
This website uses cookies.