Categories: EntertainmentNews

Pawan Kalyan : పవన్ దగ్గర ఆస్తులు పెద్దగా లేవు.. ఆ పొలం కూడా అప్పు చేసి కొన్నాడన్న నాగబాబు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. తమ్ముడు, జల్సా సినిమాలు చూస్తూ హ్యాపీగా గడుపుతున్నారు.మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి, నాగబాబు, చరణ్ ఇలా అందరూ విషెస్ చెప్పారు. దేశవ్యాప్తంగా పవన్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిపై అంతులేని అభిమానాన్నిచూపిస్తున్నారు.

Pawan Kalyan : పవన్ అప్పులు చేసి ఆస్తి కొన్నాడు..

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన ఆస్తులపై వార్తలు వైరల్ అవుతుండటంతో మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ కు పెద్దగా ఆస్తులు లేవని కుండబద్దలు కొట్టాడు. ఈ ఒక్క కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తమ్ముడు, జల్సా సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా ఈ విషయం తెలిసి షాక్ అయినట్టు సమాచారం.. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అందరికంటే ఎక్కువగా రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయన మార్కెట్ ఇటీవల కాలంలో చాలా బాగా పెరిగింది. ఎప్పుడైతే బాహుబలి వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఎనలేని క్రేజ్ తీసుకువచ్చాయో పవన్ కూడా తన సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచినట్టు సమాచారం.

Nagababu About Pawan Kalyan Properties And Land

అత్తారింటికి దారేది చిత్రం భారీ విజయం సాధించడంతో పవన్ ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.. తన తమ్ముడి బర్త్ డే సందర్భంగా నాగబాబు పవన్ ఆస్తులపై కీలక కామెంట్ చేశారు. మాకు తాతలు సంపాదించి పెట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులు ఏవీ లేవు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోల కంటే పవన్ కళ్యాణ్ పారితోషకం ఎక్కువ.అయినప్పటికీ కళ్యాణ్ బాబు దగ్గర ఎంత ఆస్తి ఉందని చెప్పుకునే పరిస్థితి లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బు మొత్తాన్ని రాజకీయాలకు, సేవా కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు. డబ్బులు దాచిపెట్టుకుని ఆస్తులు పెద్దగా పోగెసుకోలేదు. ఇక శంకర్ పల్లిలో వ్యవసాయం కోసం 8 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశాడు. అది కూడా ఫైనాన్స్‌లో తీసుకుని నెలనెలా ఈఎంఐ కడుతున్నాడని నాగబాబు చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Recent Posts

AP Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే రేషన్ కార్డులకు దరఖాస్తులు

AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్ర‌దేశ్‌ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూత‌న రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు…

52 minutes ago

Chapati In TEA : టీలో చ‌పాతి ముంచుకొని తింటే ప్రాణాలు పోతాయి.. జ‌ర భ‌ద్రం

Chapati In TEA : కొంద‌రికి టీలో కొన్ని వ‌స్తువుల‌ని ముంచుకొని తిన‌డం అల‌వాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…

2 hours ago

Eating Raw Onion In Summers : వేసవి ఆహారంలో ఉల్లిపాయల‌ను చేర్చుకోండి.. ఈ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందండి

Eating Raw Onion In Summers : మండే వాతావరణం ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి, శరీరాన్ని ప్రశాంతంగా,…

2 hours ago

Astrology : 12 ఏళ్ల త‌ర్వాత బృహస్ప‌తి కటాక్షం.. కోటీశ్వ‌రుల‌య్యే రాశులివే..!

Astrology : 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి బృహస్పతి సంచారం సాగుతుంది.గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ…

3 hours ago

Dinner Before Sunset : జైనుల ఆరోగ్య ర‌హ‌స్యం.. సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం

Dinner Before Sunset : మన ఆహార ఎంపికలు మన శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయనేది తెలిసిందే. అయితే,…

3 hours ago

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్‌తో మ్యారేజ్.. ఈ భామ మాముల్ది కాదు

తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తన అందంతో, హైట్…

13 hours ago

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…

14 hours ago

RTC Strike : హమ్మయ్య.. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది

RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…

15 hours ago