Balakrishna : బాలకృష్ణతో సింహరాశి చేయాలనుకున్న దర్శకుడు.. చేయనని మొహంమీదే చెప్పేసిన బాలయ్య..!
Balakrishna : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు ఎలా సెట్ అవుతాయో ఊహించడం చాలా కష్టం. దర్శకులు కొంత మంది హీరోలను ఊహించి కథలు రాస్తే అవి వేరే వాళ్ల దగ్గరకు వెళుతుంటాయి. దర్శకుడు వి సముద్ర .. సింహరాశి సినిమాని బాలయ్యతో చేయాలనీ ఆయనని సంప్రదించగా, సమరసింహారెడ్డి సక్సెస్ తో తర్వాత ఇలాంటి సినిమా కరెక్ట్ కాదని బాలయ్య రిజెక్ట్ చేశారట. సింహరాశి నువ్వు చేసేయ్, తర్వాత నీతో సినిమా చేస్తానని చెప్పి చెన్నకేశవరెడ్డి స్టోరీ వినమన్నారట.
వివి వినాయక్ స్టోరీ రైటర్ గా చెన్నకేశరెడ్డికి ఉండగా, ముందు ఆ స్టోరీ బాలయ్యకు నచ్చకపోవడంతో సముద్రని ఆ స్టోరీ వినమన్నాడట బాలయ్య. చెన్నకేశవరెడ్డి స్టోరీ వినడానికి వెళ్లిన సమయంలో ఆది స్టోరీ కూడా వినిపించాడట వినాయక్. అయితే చెన్నకేశవరెడ్డి సినిమాకి దర్శకుడిగా ఉండాల్సిన సముద్ర ప్రాజెక్ట్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు. వివి వినాయక్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Balakrishna : అలా మిస్ అయిందా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఇందులో బ్లాక్‌బస్టర్ సినిమాలున్నాయి. రికార్డు సృష్టించిన సినిమాలున్నాయి. అలాగే బాలకృష్ణ వదులుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని కథ నచ్చాక వదిలేస్తే మరికొన్ని డేట్స్ అడ్జెస్ట్ అవ్వక వదిలేశారు బాలయ్య. చంటి,బజారు రౌడీ, సూర్యవంశం, సింహరాశి, సీతయ్య, సింహాద్రి, వకీల్ సాబ్ వంటి చిత్రాలు ఉన్నాయి.