BalaKrishna : వైఎస్ జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ బాల‌కృష్ణ అడిగాడు.. ఏం జ‌రిగిందో చెప్పిన పేర్నినాని

BalaKrishna : గ‌త కొద్ది రోజులుగా ఏపీలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. సినిమా టికెట్ల ధరల వివాదం జోరుగా సాగుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యింది. ఆ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, అదనపు షోలతో పాటు పలు అంశాలు చర్చకు వచ్చాయి. అయితే నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం జ‌ర‌గ‌గా, ఈ రోజు పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. తాను అలా అనుకోవ‌డం లేద‌ని మీడియా ముఖంగా తెలియ‌జేశారు.

అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని, అదే సమయంలో వారు హీరో బాలకృష్ణతోనూ ఫోన్ లో మాట్లాడించారని నాని చెప్పారు. జగన్ ను కలుస్తానని బాలకృష్ణ చెప్పారని, అదే విషయాన్ని సీఎం జగన్ కు తాను తెలిపానని అన్నారు.బాలకృష్ణ తనను కలిస్తే అది వేరే విధమైన ప్రచారానికి కారణమౌతుందని అన్నారని నాని వెల్లడించారు.

balakrishna asks th appointment says perni nani

BalaKrishna : బాల‌య్య వ్యాఖ్య‌లపై పేర్ని నాని స‌మాధానం..

‘అఖండ’ సినిమా నిర్మాతలు ఆ సినిమాను చక్కగా విడుదల చేసుకున్నారని, వారికి తాము ఏమైనా ఇబ్బంది కలిగించి ఉంటే చెప్పాలని నాని ప్రశ్నించారు. తాను చెప్పినదంతా అక్షర సత్యమని.. దీనిపై చర్చకు సిద్ధమని కూడా పేర్ని నాని తెలిపారు. ఇక భీమ్లా నాయక్ టికెట్ల వివాదంపైనా పేర్ని నాని ఘాటుగా స్పందించారు. హైకోర్టు చెప్పినట్లు థియేటర్ల యజమానులు జేసీలకు దరఖాస్తు చేసుకోవచ్చుకదా అని ప్రశ్నించారు. మంత్రి మరణం వల్ల జీవో జారీ ఆలస్యమైందని దాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాద్దం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago