Balakrishna : కాలేజీలో బాలకృష్ణ ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి ఈవిడే .. ఇప్పుడు ఎలా ఉందో చూడండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : కాలేజీలో బాలకృష్ణ ప్రాణం గా ప్రేమించిన అమ్మాయి ఈవిడే .. ఇప్పుడు ఎలా ఉందో చూడండి !

 Authored By prabhas | The Telugu News | Updated on :27 November 2022,7:40 pm

Balakrishna : బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో రెండవ సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే రెండు సీజన్లో వచ్చిన ఎపిసోడ్స్ అన్ని దుమ్ము దులిపేసాయి. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ వచ్చారు. ఆ తర్వాత రెండు మూడు ఎపిసోడ్స్ కు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, శర్వానంద్, అడవి శేషులు వచ్చారు. ఇక నాలుగవ ఎపిసోడ్ బాలయ్య చిన్ననాటి ఫ్రెండ్స్ అయినా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రస్తుత తెలంగాణ మంత్రి సురేష్ రెడ్డి వచ్చారు. వీళ్ళతోపాటు సీనియర్ నటి రాధిక కూడా ఈ షోకు వచ్చారు.

అయితే ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. చివర్లో ముగ్గురు ఫ్రెండ్స్ తో పాటు కామన్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఆ ఇద్దరిలో ఒక ఫ్రెండ్ ఆశ గుర్తుందా అని అడిగాడు. వెంటనే బాలయ్య ఆ ఎందుకు గుర్తులేదు ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అని చెప్పగా అతడు బాలయ్య ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పడు. నీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది అని చెప్పబోతుండగా వెంటనే బాలయ్య నోరు మూసేశాడు. ఈ సంభాషణను బట్టి చూస్తే ఆశ బాలయ్య క్లాస్మేట్ అని చదువుకునే రోజుల్లో ఏదో చిలిపి పని చేసుంటారని చర్చ నడుస్తుంది.

Balakrishna first crush asha pics viral

Balakrishna first crush asha pics viral

కొంతమంది ఏమో బాలయ్య నోరు మూసేశాడు అంటే ఆశ బాలయ్య ఫస్ట్ క్రష్ అయి ఉంటుందని అనుకుంటున్నారు. మరి కొందరు భవిష్యత్తులో బాలయ్య ఆశ గురించి చెప్పవచ్చని అంటున్నారు. ఇక మీ లైఫ్ లో అత్యంత సంక్లిష్టమైన పాత్ర ఏది అని అడగ్గా దానికి బదులుగా బాలయ్య శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పాత్ర అని చెప్పాడు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి బాలయ్య హీరో అవుతాడని అస్సలు అనుకోలేదు అని అన్నారు. వెంటనే బాలకృష్ణ నువ్వు సీఎం అవుతావని నేను అనుకోలేదు అని కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ నాలుగవ ఎపిసోడ్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది