Balakrishna : నటసింహం బాలకృష్ణ.. ఈ పేరును తెలుగు సినీ ఇండస్ట్రీకి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో ఈయన ఒకరు. అటు ఎమ్మెల్యేగా పొలిటికల్ లైఫ్‌ను ఇటు హీరోగా సినీ లైఫ్‌ను బ్యాలన్స్ చేస్తున్నారు బాలయ్య. ఈ వయస్సులోనూ తన డైలాగ్స్‌తో, స్టె్ప్పులతో, ఫైట్స్‌తో కుర్ర హీరోలకు తానేమి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భిన్నమైన టాక్ సొంతం చేసుకుంటున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ మూవీలో హిట్ అయ్యాయి. ప్రస్తుతం అఖండ సైతం భారీ విజయాన్ని అందుకుంటుండటంతో వీరిద్దరూ హైట్రిక్ కొట్టారు.ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకతో ఆడిటోరియంకే కాదు.. మూవీ ఇండస్ట్రీకి ఓ ఊపు తీసుకొచ్చారని చెప్పాడు రాజమౌళి. డిసెంబర్ 2 నుంచి మొదులుకుని థియేటర్స్ సైతం కంటిన్యూగా హౌస్‌ఫుల్ అయ్యే విధంగా టాలీవుడ్ ప్రేక్షకులకు అఖండ మూవీ ఉత్సాహం కల్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు. ఆయన కోరుకున్నట్టే ప్రస్తుతం అఖండ మూవీతో థియేటర్స్ అన్ని నిండిపోతున్నాయి.
భారీ బడ్జెట్ మూవీస్ తీయాలా వద్దా? ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా లేదా అన్న అనుమానాలు బద్దలు కొడుతూ అఖండ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల వరకు వసూళ్ల సాధించిందని టాక్. దీంతో పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి పెద్ద సినిమాలు ధైర్యంగా రిలీజ్ చేయొచ్చన్న ధైర్యం ఆ మూవీస్ ప్రొడ్యుసర్స్ కు కలుగుతోంది. మరి అఖండ మూవీ ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.