BalaKrishna : నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాకుండా హోస్ట్‌గాను అదరగొడుతున్న విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ అనే షోలో తన విశ్వరూపం చూపించి మంచి రేటింగ్ రాబట్టాడు బాలకృష్ణ. తొలి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇటీవలే రెండో సీజన్ ను చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ కు లక్షల్లో వ్యూస్ వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. అదే జోష్ లో మరో ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. రెండో ఎపిసోడ్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరియు ‘డీజే టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు. విశ్వక్ – సిద్ధు ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో బాలయ్య తో కలిసి సందడి చేసారు.
సినిమాలతో పాటుగా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. బ్రేకప్ లు – రొమాంటిక్ సీన్ల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ బ్రాండ్ గా పేరుబడిన మాన్షన్ హౌస్ గురించి చెప్పడానికి కూడా నటసింహం వెనకాడలేదు. ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బయటకు వచ్చిన నేపథ్యంలో.. మూడేళ్ళ కష్టానికి ఆ కిస్ మాకు రిలీఫ్ అని తెలిపాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ..’నాకూ విశ్వక్ కు రిలీఫ్ అంటే మ్యాన్షన్ హౌస్.. నీకు ముద్దు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అలానే ‘మీ ఇద్దరు సాయంత్రం వెళ్లేప్పుడు మార్గ మధ్యలో మేన్షన్ హౌస్ కొనుక్కొని ఎవరు బెటర్ హీరో అనేది ఫిక్స్ అయిపోండి..
BalaKrishna fun with young heroes
రేపు పొద్దున్న నాకు ఎస్ఎమ్ఎస్ చేయండి’ మరో సందర్భంలో అన్నారు బాలకృష్ణ. దీంతో మాన్షన్ హౌజ్ ఇద్దరికి రిలీఫ్ కాబట్టి కలిసి వేస్తారా ఏంటని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో నేను నీకు అఫిషియల్ గా డైరెక్టర్ ఛాన్స్ ఇస్తున్నా.. ఎప్పుడైన సరే.. ఓపెన్ ఆఫర్ అని విశ్వక్ తో బాలయ్య అంటే అవునా సార్.. అని ఆశ్చర్యపోతాడు. తర్వాత నువ్ నన్ను ఇప్పుడు డైరెక్ట్ చేయమని అడగ్గా.. మీకు ఫ్యాన్స్ కావాలా.. హీరోయిన్ కావాలా.. అని అడుగుతాను, దానికి మీరు మింగితే.. షేప్ అవుట్ అవుతావ్ మసాల వడా అని అనమని చెబుతాడు విశ్వక్ సేన్.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.