BalaKrishna : మ్యాన్ష‌న్ హౌస్ బ్రాండి ఆ హీరోతో క‌లిసి తీసుకుంటాన‌న్న బాలయ్య‌.. అవాక్క‌యిన ప్రేక్ష‌కులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BalaKrishna : మ్యాన్ష‌న్ హౌస్ బ్రాండి ఆ హీరోతో క‌లిసి తీసుకుంటాన‌న్న బాలయ్య‌.. అవాక్క‌యిన ప్రేక్ష‌కులు

 Authored By sandeep | The Telugu News | Updated on :23 October 2022,5:30 pm

BalaKrishna : నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్న విష‌యం తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ అనే షోలో త‌న విశ్వ‌రూపం చూపించి మంచి రేటింగ్ రాబ‌ట్టాడు బాల‌కృష్ణ‌. తొలి సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఇటీవలే రెండో సీజన్ ను చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. మొదటి ఎపిసోడ్ కు లక్షల్లో వ్యూస్ వచ్చి రికార్డు క్రియేట్ చేసింది. అదే జోష్ లో మరో ఎపిసోడ్ ను ప్రసారం చేశారు. రెండో ఎపిసోడ్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరియు ‘డీజే టిల్లు’ సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు. విశ్వక్ – సిద్ధు ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో బాలయ్య తో కలిసి సందడి చేసారు.

సినిమాలతో పాటుగా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. బ్రేకప్ లు – రొమాంటిక్ సీన్ల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ బ్రాండ్ గా పేరుబడిన మాన్షన్ హౌస్ గురించి చెప్పడానికి కూడా నటసింహం వెనకాడలేదు. ‘కృష్ణ అండ్ హిస్ లీల’ సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బయటకు వచ్చిన నేపథ్యంలో.. మూడేళ్ళ కష్టానికి ఆ కిస్ మాకు రిలీఫ్ అని తెలిపాడు. దీనికి బాలయ్య స్పందిస్తూ..’నాకూ విశ్వక్ కు రిలీఫ్ అంటే మ్యాన్షన్ హౌస్.. నీకు ముద్దు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అలానే ‘మీ ఇద్దరు సాయంత్రం వెళ్లేప్పుడు మార్గ మధ్యలో మేన్షన్ హౌస్ కొనుక్కొని ఎవరు బెటర్ హీరో అనేది ఫిక్స్ అయిపోండి..

BalaKrishna fun with young heroes

BalaKrishna fun with young heroes

BalaKrishna : బాల‌య్య ర‌చ్చ‌…!

రేపు పొద్దున్న నాకు ఎస్ఎమ్ఎస్ చేయండి’ మరో సందర్భంలో అన్నారు బాలకృష్ణ. దీంతో మాన్ష‌న్ హౌజ్ ఇద్ద‌రికి రిలీఫ్ కాబ‌ట్టి క‌లిసి వేస్తారా ఏంట‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. ఇక ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో నేను నీకు అఫిషియల్ గా డైరెక్టర్ ఛాన్స్ ఇస్తున్నా.. ఎప్పుడైన సరే.. ఓపెన్ ఆఫర్ అని విశ్వక్ తో బాల‌య్య‌ అంటే అవునా సార్.. అని ఆశ్చర్యపోతాడు. తర్వాత నువ్ నన్ను ఇప్పుడు డైరెక్ట్ చేయమని అడగ్గా.. మీకు ఫ్యాన్స్ కావాలా.. హీరోయిన్ కావాలా.. అని అడుగుతాను, దానికి మీరు మింగితే.. షేప్ అవుట్ అవుతావ్ మసాల వడా అని అనమని చెబుతాడు విశ్వక్ సేన్.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది