Chiranjeevi – Balakrishna : మెగాస్టార్ కంటే ఈ విషయంలో బాలయ్య అంత గ్రేటా..!

Authored By vamana sai | The Telugu News | Updated on: May 2, 2022, 5:06 pm

Chiranjeevi – Balakrishna: ఈ మధ్య మెగా అభిమానులు నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. దీనికి కారణం ఆర్ఆర్ఆర్, అఖండ, ఆచార్య సినిమాలు. బాలయ్య 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ హిట్ దక్కిందంటే అఖండ సినిమాతోనే. ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాపయ్యాయి. ఎన్ని ఫ్లాపులొచ్చినా బాలయ్య ఇమేజ్ తగ్గదు. అదే ఊపుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక బాలయ్య కరోనా ప్యాండమిక్ ఉన్నా, ఏపీలో టికెట్ రేట్ పెంచక పోయినా అఖండ సినిమాతో నిర్మాతకు భారీ లాభాలను తెచ్చిపెట్టారు. దీనికి ముఖ్య కారణం సినిమా బడ్జెట్‌ను వీలైనంత కంట్రోల్ చేయడమే.

అంతేకాదు, షూటింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేసి అఖండ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఒకసారి లాకయిన కథను బాలయ్య పొరపాటున వేలుపెట్టి కెలకరు. ఫైనల్ అయిన్ స్క్రిప్ట్‌తో సెట్స్ మీదకు వెళ్ళిపోతారు. అందుకే, బాలయ్య సినిమా షూటింగ్ త్వరగా పూర్తవుతుంది. ఈ విషయంలో బాలయ్య గ్రేట్ అని చెప్పక తప్పదు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇటు మెగా హీరో అటు నందమూరి హీరో నటించాడు. ఈ సినిమా రిలీజయ్యాక కూడా రక రకాల చర్చలు సాగాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెపుకున్నారు. ఆ వేడి తగ్గిందనుకుంటే ఇప్పుడు ఆచార్య హడావుడి మొదలైంది. మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.

balakrishna-is-great-in-this-accept-than-chiranjeevi

balakrishna-is-great-in-this-accept-than-chiranjeevi

Chiranjeevi – Balakrishna: మెగా ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని చెప్పక తప్పదు.

దీనికి ముఖ్య కారణాలు ఇవే అంటూ ఇప్పుడు ఒక్కొక్కో విషయం బయటకు వస్తోంది. కొరటాల శివ పక్కా కథ తయారు చేసుకున్నప్పటికి దాన్ని మెగాస్టార్ చరణ్ పాత్ర నిడివి పెంచేందుకు పలు మార్పులు సూచించి స్క్రిప్ట్‌ మార్చారని టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఎంత కరోనా ప్యాండమిక్ అయినా కూడా నాలుగేళ్ళు ఓ సినిమా మీద సమయం, దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించడంతో ఇప్పుడు తీవ్రంగా నష్టాలు వచ్చాయి. అదనపు షోలు, టికెట్ రేట్ పెరిగినా కూడా భారీ నష్టాలు వచ్చాయంటే ఆచార్య సినిమా విషయంలో మెగా ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని చెప్పక తప్పదు. అందుకే, ఏ రకంగా చూసిన బాలయ్య గ్రేట్ అంటున్నారు. దీనిని మెగా ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp