Balakrishna Comments About Jr NTR
Balakrishna : బాబాయ్ బాలయ్యతో తారక్..అభిమానులు కోరుకుంటున్న రోజు రాబోతోంది..! అవుతును దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎదుగుతున్న సమయంలో బాలయ్యతో సరిగ్గా మాటల్లేకపోవడం..తారక్ సినిమా హిట్ అయినా బాలయ్య ప్రశంసించకపోవడం లాంటివి జరిగాయని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. చెప్పాలంటే ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించింది చాలా తక్కువ సందర్భాలే. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ అంటే, అంతగా బాలయ్యకు పడదనే టాక్ కూడా వినిపించింది. అయితే, రాను రాను అది పూర్తిగా తగ్గిపోయింది.
ఎన్టీఆర్ సినిమా ఆడియో ఈవెంట్స్‌కు సక్సెస్ సెలబ్రేషన్స్‌కు బాలయ్య రావడం పొగడ్తల వర్షం కురిపించడం జరిగాయి. ఇక రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ పార్టీ కోసం తనవంతుగా ప్రచారం చేశాడు. అయితే, మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి. మెగా హీరోలు కలిసి నటిస్తున్నారు. మంచు హీరోలు, అక్కినేని హీరోలు, దగ్గుబాటి హీరోలు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాల సక్సెస్ సంగతి ఎలా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం కన్నుల పండుగగా ఉంటోంది.అందుకే, ఎన్టీఆర్ – బాలయ్య కలిసి ఓ భారీ చిత్రం చేస్తే చూడాలని
Balakrishna Jr NTR The Day fans want is coming
నందమూరి అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమాలో కాకపోయినా చాలాకాలానికి ఎన్టీఆర్ – బాలయ్య – కళ్యాణ్ రాం కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారని తాజా సమాచారం. ఈ మే 28న నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుకలని ఘనంగా బాలకృష్ణ సొంత ఊరైన నిమ్మకూరులో మొదలుపెట్టనున్నాడు. ఈ వేడులో బాలయ్యతో పాటు నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న, నారా రోహిత్ పాల్గొనబోతున్నారట. తాత అంటే తారక్ కు మిగతా నందమూరి యువ హీరోలకు అమితమైన ఇష్టం. కాబట్టి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నారు.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.