Balakrishna : బాబాయ్ బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్..అభిమానులు కోరుకుంటున్న రోజు రాబోతోంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : బాబాయ్ బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్..అభిమానులు కోరుకుంటున్న రోజు రాబోతోంది..!

 Authored By govind | The Telugu News | Updated on :17 May 2022,1:00 pm

Balakrishna : బాబాయ్ బాలయ్యతో తారక్..అభిమానులు కోరుకుంటున్న రోజు రాబోతోంది..! అవుతును దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎదుగుతున్న సమయంలో బాలయ్యతో సరిగ్గా మాటల్లేకపోవడం..తారక్ సినిమా హిట్ అయినా బాలయ్య ప్రశంసించకపోవడం లాంటివి జరిగాయని అప్పట్లో వార్తలు బాగానే వచ్చాయి. చెప్పాలంటే ఇద్దరూ కలిసి ఒకే వేదిక మీద కనిపించింది చాలా తక్కువ సందర్భాలే. అందుకే, జూనియర్ ఎన్టీఆర్ అంటే, అంతగా బాలయ్యకు పడదనే టాక్ కూడా వినిపించింది. అయితే, రాను రాను అది పూర్తిగా తగ్గిపోయింది.

ఎన్టీఆర్ సినిమా ఆడియో ఈవెంట్స్‌కు సక్సెస్ సెలబ్రేషన్స్‌కు బాలయ్య రావడం పొగడ్తల వర్షం కురిపించడం జరిగాయి. ఇక రాజకీయ పరంగా కూడా ఎన్టీఆర్ పార్టీ కోసం తనవంతుగా ప్రచారం చేశాడు. అయితే, మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి. మెగా హీరోలు కలిసి నటిస్తున్నారు. మంచు హీరోలు, అక్కినేని హీరోలు, దగ్గుబాటి హీరోలు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాల సక్సెస్ సంగతి ఎలా ఉన్నా కూడా అభిమానులకు మాత్రం కన్నుల పండుగగా ఉంటోంది.అందుకే, ఎన్టీఆర్ – బాలయ్య కలిసి ఓ భారీ చిత్రం చేస్తే చూడాలని

Balakrishna Jr NTR The Day fans want is coming

Balakrishna Jr NTR The Day fans want is coming

Balakrishna : ఈ వేడులో బాలయ్యతో పాటు నందమూరి హీరోలు..

నందమూరి అభిమానులే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమాలో కాకపోయినా చాలాకాలానికి ఎన్టీఆర్ – బాలయ్య – కళ్యాణ్ రాం కలిసి ఒకే వేదికపైకి రాబోతున్నారని తాజా సమాచారం. ఈ మే 28న నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగబోతున్నాయి. ఈ వేడుకలని ఘనంగా బాలకృష్ణ సొంత ఊరైన నిమ్మకూరులో మొదలుపెట్టనున్నాడు. ఈ వేడులో బాలయ్యతో పాటు నందమూరి హీరోలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న, నారా రోహిత్ పాల్గొనబోతున్నారట. తాత అంటే తారక్ కు మిగతా నందమూరి యువ హీరోలకు అమితమైన ఇష్టం. కాబట్టి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తారని ఆశిస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది