Balakrishna : పేకాట‌కి బానిసైన బాల‌కృష్ణ‌.. బాబోయ్ అన్ని డ‌బ్బులు పోగొట్టున్నాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : పేకాట‌కి బానిసైన బాల‌కృష్ణ‌.. బాబోయ్ అన్ని డ‌బ్బులు పోగొట్టున్నాడా..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌లో న‌టించారు. సాంఘిక‌, పౌరాణిక ఇలా ఎన్నో జాన‌ర్స్‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించాడు బాల‌య్య. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రానికి నిర్మాత‌గా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 November 2022,12:20 pm

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఎన్టీఆర్ న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుత‌మైన సినిమాల‌లో న‌టించారు. సాంఘిక‌, పౌరాణిక ఇలా ఎన్నో జాన‌ర్స్‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించాడు బాల‌య్య. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాల‌కృష్ణ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని డైరెక్ట‌ర్ ప‌క్కా మాస్ ఎలివేష‌న్ ఇచ్చేలా క‌థ‌ను సిద్ధం చేసి సినిమా రూపొందిస్తున్నారు.

వీర శంకర్ రెడ్డి అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేయ‌గా, ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన చిన్న పాటి టీజ‌ర్ సినిమాపై ఉన్న ఎక్స్‌ఫెక్టేష‌న్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లిపోయింది. అయితే బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ కూడా తనలో ఉన్న కొన్ని అలవాట్లు మాత్రం ఇప్ప‌టికీ మార్చుకోలేదట. బాల‌య్య‌కు పేకాట ఆడే అల‌వాటు ఉండ‌గా, దాని గురించి తాజాగా తాజాగా డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నేను బాలకృష్ణ నటించిన ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ‌ర్క్ చేసాను. అయితే ఆ టైంలో బాలకృష్ణ నాతో ఎంతో సరదాగా ఉండేవారు. షూటింగ్ టైంలో బాలకృష్ణ నన్ను మీకు పేకాట ఆడడం వచ్చా అని అడిగారు. వచ్చు అని చెప్పగానే ఇద్ద‌రం పేకాట ఆడడం మొదలుపెట్టాం.పేకాట ఆడి పది రూపాయలు పోగొట్టుకున్నారు.

Balakrishna play playing cards

Balakrishna play playing cards

Balakrishna : బాల‌య్య‌కు ఆ అల‌వాటు కూడా ఉందా?

కొద్దిసేపు అయ్యాక నేను వెళ్తాను సార్ అని ఎంత చెప్పినా వినలేదు, నువ్వు ఇప్పుడు ఆడాల్సిందే అని బాలయ్య పట్టుబట్టారు. ఇది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అంటూ జి. నాగేశ్వర్ రెడ్డి స‌ద‌రు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ విష‌యం తెలుసుకున్న చాలా మంది బాల‌కృష్ణ పేకాట ఆడ‌తారా అంటూ నోరెళ్ల‌పెడుతున్నారు. ఆయ‌న స‌రదాగా పేకాట ఆడేవారు త‌ప్ప‌, ఎప్పుడు కూడా దానికి బానిసై డ‌బ్బులు పోగొట్టుకుంది లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. ఇక బాల‌య్య ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో సీజన్ 2 కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. షో కి వచ్చే గెస్ట్ ల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానుల మన్న‌న‌లు పొందుతున్న విష‌యం తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది