Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫాంలో అన్‌స్టాపుబల్ అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో దూసుకెళుతుంది. తొలి సీజన్‌కి మంచి పాపులారిటీ లభించగా, రెండో సీజన్‌కి సైతం మంచి ఆదరణ లభిస్తుంది. రెండో సీజన్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గెస్ట్ గా రెండో సీజన్ ప్రారంభమైంది. తొలి ఎపిసోడ్ రికార్డ్ వ్యూస్ రావడం విశేషం. ఇదొక సంచలనాత్మక ఎపిసోడ్‌గా మారింది. `ఎన్టీఆర్ వెన్నుపోటు` అంశం ప్రధానంగా సాగిన ఈ ఎపిసోడ్ బాగా హైలైట్ అయ్యింది. అదే సమయంలో `అన్‌స్టాపబుల్` సినిమా ప్రముఖులే కాదు, రాజకీయ ప్రముఖులు కూడా రావచ్చనే సంకేతాలనిచ్చింది.
అన్‌స్టాపబుల్ సీజన్ రెండో ఎపిసోడ్ అంతకుమించి అన్నట్లుగా ప్లాన్ చేసింది ఆహా టీం. అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ కోసం ఏకంగా ఇద్దరు యువ హీరోలను బాలయ్య ముందుకు తీసుకొస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో పాటు మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ లను ఇంటర్వ్యూ చేశారు బాలయ్య బాబు. వీరు అనేక ఆసక్తికర విషయాలను తెలియజేశారు. మూడో ఎపిసోడ్లో రమ్యకృష్ణ, రాశీ ఖన్నాల సందడి చూడబోతున్నామనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ ఈ వీకెండ్ జరుగుతుందని తెలుస్తోంది. ఆ ఇద్దరు హీరోయిన్లతో బాలయ్య బాబు హంగామా మామూలుగా ఉండదట. ఈ మేరకు అన్నీ పక్కాగా ప్లాన్ చేశారని టాక్.
ఇదిలా ఉంటే `అన్‌స్టాపబుల్` షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోవడం వెనకాల హోస్ట్ బాలయ్య పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఆయన తన ఇమేజ్‌ని పక్కన పెట్టి ఈ షోని చేస్తున్నారు. అలాగే తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈషోకి బాలకృష్ణ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా, ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది. మొదటి సీజన్‌కి బాలయ్య ఆరు కోట్లు పారితోషికంగా తీసుకున్నారట. దాదాపు పదికిపైగా ఎపిసోడ్లు చేశారు బాలయ్య. అయితే అది సక్సెస్ కావడంతో ఈ సారి పారితోషికం పెంచారని సమాచారం. రెండో సీజన్‌కి ఆయన రూ.9కోట్లు పారితోషికంగా అందుకుంటు న్నారు. సీజన్ మొత్తానికి కలిపి ఆయన ఈ మొత్తాన్ని అందుకుంటున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.