
Balakrishna risk for Taraka Ratna
Taraka Ratna : నందమూరి తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో లోకేష్ కు మద్దతుగా ఆ పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభించిన కొద్ది సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే తారకరత్నకు గుండెపోటు వచ్చిన దగ్గరనుంచి బాబాయి బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని చెప్పవచ్చు.
Balakrishna risk for Taraka Ratna
గత కొన్ని రోజులుగా తారకరత్న పక్కనే ఉండి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నాడు బాలయ్య. అయితే తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని బాలయ్య మరో సంకల్పం తీసుకున్నారు. అఖండ దీపారాధన చేపట్టారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయస్వామి ఆలయంలో అఖండజ్యోతి దీపారాధన కొనసాగుతోంది. కఠోరదీక్షతో నియమబద్ధంగా అఖండ దీపారాధన కొనసాగుతుంది. దీపాలను ప్రమిదల్లో కాకుండా మట్టి, కంచు పాత్రల్లో వెలిగిస్తారు. అఖండజ్యోతి దీపారాధన దాదాపు 44 రోజులు కొనసాగనుంది.
Balakrishna risk for Taraka Ratna
ఇక తారకరత్న ఆరోగ్యం కూడా రోజురోజుకీ మెరుగవుతుంది. గుండె, కాలేయం పనితీరు సరిగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదడుకు సంబంధించిన చికిత్స జరగనుంది. అయితే తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్య తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు. మొదటి రోజు నుంచి కూడా బాలయ్య తారకరత్న దగ్గరుండి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అన్న కొడుకుని సొంత కొడుకులా చూసుకుంటున్నాడు. ఎంతో బిజీగా ఉండే బాలయ్య అన్నింటికి విరామం ఇచ్చి ఆస్పత్రికి అంకితమయ్యారు. బాలయ్య తీరు ఆయన అభిమానులను గర్వపడేలా చేస్తుంది.
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…
Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
This website uses cookies.