Mokshajna : మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలి అని కోరుకునే బాలయ్య ఫ్యాన్స్ అందరికీ గుండె పగిలే బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mokshajna : మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలి అని కోరుకునే బాలయ్య ఫ్యాన్స్ అందరికీ గుండె పగిలే బ్రేకింగ్ న్యూస్ !

Mokshajna : టాలీవుడ్ లో నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. చాలా కాలం నుంచి మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడా లేదా అనేది కొంతమందిలో డౌట్ కూడా వచ్చింది. అయితే కొద్దిరోజుల క్రితం బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని, అతను నందమూరి కి […]

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2023,5:00 pm

Mokshajna : టాలీవుడ్ లో నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. చాలా కాలం నుంచి మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడా లేదా అనేది కొంతమందిలో డౌట్ కూడా వచ్చింది. అయితే కొద్దిరోజుల క్రితం బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని, అతను నందమూరి కి అసలు సిసలైన వారసుడు, మా లెజసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అతనిపై ఉందని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లకు దగ్గర పడుతుంది. చిరంజీవి, నాగార్జున కొడుకులు 23 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ 30 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ రంగప్రవేశం చేయలేదు అని నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం మోక్షజ్ఞ జాతకమే అని అంటున్నారు బాలయ్య. ఇక మనకు తెలిసిందే బాలయ్య జాతకాలను, సాంప్రదాయాలను తప్పకుండా ఫాలో అవుతారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోక్షజ్ఞ జాతకం బాగోలేదట. ముందుగా ఎంట్రీ ఇస్తే అపజయాలు వస్తాయని, 2024 లో ఎంట్రీ ఇస్తే అతని కెరీర్ లో ఎక్కువ శాతం విజయాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారట.

balakrishna son mokshajna cine entry with puri jagannath

balakrishna-son-mokshajna-cine-entry-with-puri-jagannath

అందుకే బాలయ్య ఇప్పటిదాకా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. బాలయ్య గతంలో పూరి జగన్నాథ్ తో ‘ పైసా వసూల్ ‘ సినిమా చేశాడు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా రాలేదు. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు. ఇక దీంతో అభిమానులు మోక్షజ్ఞ పూరి జగన్నాథ్ తో ఎంట్రీ అంటే భయపడుతున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా వార్తలు వస్తున్నాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది