Mokshajna : టాలీవుడ్ లో నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో అభిమానులు బాలయ్య కొడుకు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. చాలా కాలం నుంచి మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు మోక్షజ్ఞ సినిమాలోకి వస్తాడా లేదా అనేది కొంతమందిలో డౌట్ కూడా వచ్చింది. అయితే కొద్దిరోజుల క్రితం బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని, అతను నందమూరి కి అసలు సిసలైన వారసుడు, మా లెజసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అతనిపై ఉందని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లకు దగ్గర పడుతుంది. చిరంజీవి, నాగార్జున కొడుకులు 23 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ 30 ఏళ్ల వయసు దగ్గర పడుతున్న మోక్షజ్ఞ మాత్రం ఇప్పటివరకు సినీ రంగప్రవేశం చేయలేదు అని నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం మోక్షజ్ఞ జాతకమే అని అంటున్నారు బాలయ్య. ఇక మనకు తెలిసిందే బాలయ్య జాతకాలను, సాంప్రదాయాలను తప్పకుండా ఫాలో అవుతారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మోక్షజ్ఞ జాతకం బాగోలేదట. ముందుగా ఎంట్రీ ఇస్తే అపజయాలు వస్తాయని, 2024 లో ఎంట్రీ ఇస్తే అతని కెరీర్ లో ఎక్కువ శాతం విజయాలు నమోదు అయ్యే అవకాశం ఉందని అన్నారట.
అందుకే బాలయ్య ఇప్పటిదాకా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. అయితే మోక్షజ్ఞ మొదటి సినిమాకి దర్శకుడిగా పూరి జగన్నాథ్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. బాలయ్య గతంలో పూరి జగన్నాథ్ తో ‘ పైసా వసూల్ ‘ సినిమా చేశాడు. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా రాలేదు. ఇక ఇటీవల పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని ఎదుర్కొన్నాడు. ఇక దీంతో అభిమానులు మోక్షజ్ఞ పూరి జగన్నాథ్ తో ఎంట్రీ అంటే భయపడుతున్నారు. ఈ వార్త నిజమో కాదో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా వార్తలు వస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.