Veera Simha Reddy Movie : ” వీరసింహారెడ్డి ” లో బాలయ్య నటన చూస్తే నోరెళ్ల పెడతారు అంటున్న స్టార్ హీరో ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Veera Simha Reddy Movie : ” వీరసింహారెడ్డి ” లో బాలయ్య నటన చూస్తే నోరెళ్ల పెడతారు అంటున్న స్టార్ హీరో ..!!

Veera Simha Reddy Movie : నటసింహం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. సంక్రాంతికి వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే బాలకృష్ణ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈరోజు ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 January 2023,7:00 pm

Veera Simha Reddy Movie : నటసింహం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న వీరసింహారెడ్డి సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. సంక్రాంతికి వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే బాలకృష్ణ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈరోజు ఒంగోలులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ట్రైలర్ కూడా ఈరోజు విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించి మాటల రచయిత బుర్ర సాయి మాధవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని చెప్పిన రివ్యూస్ లకు బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో విలన్ గా నటించిన కన్నడ నటుడు దునియా విజయ్ సినిమా గురించి హైలెట్ న్యూస్ చెప్పాడు. అసలు ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలిసినప్పుడు నేను చాలా థ్రిల్ ఫీలయ్యానని, ఈ పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతుందని తెలిపారు. అసలు ఈ పాత్రకు నన్ను ఎందుకు తీసుకున్నారని డైరెక్టర్ ని అడిగాను.

Balakrishna super performance in Veera Simha Reddy Movie

Balakrishna super performance in Veera Simha Reddy Movie

గోపీచంద్ గతంలో నా వర్క్ చూసి ఆ పాత్రకి మీరైతే సూట్ అవుతారని అందుకే తీసుకున్నారని విజయ్ చెప్పారు. ఈ సినిమాలో నా లుక్ చాలా మొరటుగా ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాపరెడ్డి అంటూ ఈ సినిమాను మరింతగా హైలెట్ చేశాడు. సినిమా కథంతా పవర్ ఫుల్ గా ఉంటుంది. అలాగే ఫైట్లు కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య నటన చూస్తే ప్రేక్షకులు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అని అన్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది