Balakrishna Bigg Boss 6 Telugu : నాగార్జునకు షాక్.. బిగ్ బాస్ 6 హోస్ట్ గా బాలకృష్ణ.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా?
Balakrishna Bigg Boss Telugu 6 : బిగ్ బాస్ సీజన్ 5 అయిపోయింది. విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. రన్నర్ గా షణ్ముఖ్ జస్వంత్ నిలిచాడు. బిగ్ బాస్ 3 సీజన్ నుంచి 5 సీజన్ వరకు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ వన్ కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించాడు.బిగ్ బాస్ వన్ సూపర్ డూపర్ హిట్ అయింది కానీ..సెకండ్ సీజన్ కు హోస్ట్ చేసిన నాని సీజన్ మాత్రం ఆవరేజ్ గా నడిచింది.
మూడో సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే.. మరో రెండు నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ 6 ను ప్రారంభించబోతున్నారట.అయితే.. బిగ్ బాస్ 6 సీజన్ కు త్వరలో ముహూర్తం పెట్టారట. బిగ్ బాస్ 5 సీజన్ సూపర్ డూపర్ హిట్ అవడంతో వెంటనే బిగ్ బాస్ 6 కు కూడా పనులు జరుగుతున్నాయట.కాకపోతే.. ఈసారి బిగ్ బాస్ 6కు హోస్ట్ గా నాగార్జున ఉండడట. నందమూరి బాలకృష్ణను హోస్ట్ గా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.

balakrishna to host bigg boss 6 telugu season
Balakrishna Bigg Boss Telugu 6 : ఓటీటీలో ప్రసారం అవుతుందా? లేక స్టార్ మా టీవీలోనా?
అయితే.. అది బిగ్ బాస్ సీజన్ 6 గా వస్తుందా? లేక ఓటీటీలో ప్రసారం అవుతుందా? అనే దానిపై క్లారిటీ రాలేదు.ఎలా ప్రసారం అయినా.. ఈసారి మాత్రం నాగార్జున హోస్ట్ గా ఉండే అవకాశం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈసారి అన్ స్టాపబుల్ షోతో సూపర్ సక్సెస్ అయిన బాలకృష్ణను తీసుకోవాలని బిగ్ బాస్ యాజమాన్యం యోచిస్తోందట. చూడాలి మరి.. బాలకృష్ణలో మరో కోణం ఈ షో ద్వారా అయినా ఎలివేట్ అవుతుందో లేదో అని.