Balakrishna : బాలయ్య నోట్లోంచి బూతులు… షో కి వచ్చిన లేడీస్ రియాక్షన్ చూడండి!
Balakrishna : అన్ స్టాపబుల్ టాక్ షో తో బాలకృష్ణ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. బాలయ్య చాలా సరదా సరదాగా ఉంటారు. అదే విషయం అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రూవ్ అయింది. ఇప్పటికే ఈ ప్రోగ్రాం మొదటి సీజన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. మొదటి ఎపిసోడ్ కి నారా లోకేష్, చంద్రబాబు వచ్చారు. రెండవ సీజన్ కి సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలో బాలకృష్ణ బూతులు మాట్లాడటం సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళితే బాలయ్య బాబు విశ్వక్సేన్ తో మాట్లాడుతూ నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు నన్ను డైరెక్ట్ చేయమని బాలకృష్ణ అంటారు.
అప్పటికప్పుడు విశ్వక్సేన్ మీకు ఫ్యాన్స్ కావాలా హీరోయిన్ కావాలా అని అడుగుతానని దానికి మీరు మింగితే షేప్ అవుట్ అవుతారు అని అనమని అంటాడట. అలాగే బాలకృష్ణ రిపీట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన నోటి వెంట మింగితే బదులుగా ఓ బూతు మాట వచ్చిందట. అయితే ఈ విషయాన్ని మాత్రం ఎవరు అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. ఇక తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేత కొరియోగ్రఫీ చేయించుకొని సిద్ధూ జొన్నలగడ్డ డీజే సినిమాలో వేసిన స్టెప్ వేసేందుకు ప్రయత్నించారట. బాలకృష్ణ ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

Balakrishna tongue slip on unstoppable talk show
అదేంటంటే అఖండ సినిమాలో బాలకృష్ణ షర్ట్స్ మార్చే స్టెప్పు చూసిన తర్వాతే డీజే టిల్లు సినిమాలో భాను మాస్టర్ కి అవకాశం ఇచ్చామని చెప్పుకు రావడంతో బాలయ్య సంతోషం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ విశ్వక్సేన్ తో చేసిన బాలయ్య ఎపిసోడ్ మాత్రం ప్రస్తుతానికి ట్రెండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ గురించి అనేక విషయాలు పంచుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇక తాజాగా బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న 127వ సినిమా టైటిల్ కూడా ఖరారు చేశారు. వీరసింహారెడ్డి అనే ఒక టైటిల్ ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.