Unstoppable : జై బాలయ్య.. రికార్డ్ సృష్టించిన బాలయ్య బాబు షో…!
Unstoppable : నందమూరి నటసింహం బాలయ్య బాబు ఓ వైపు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటునే మరోవైపు నిత్యం సినిమాలతో తన అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుత డిజిటల్ కాలానికి అనుగుణంగా మరో అడుగు ముందుకేసి… ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కుడా త సత్తా చాటుతున్నారు. అల్లు అరవింద్ కు చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే అనే టాక్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కార్యక్రమం రోజు రోజుకు అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఏకంగా నాలుగు మిలియన్లకు పైగా లైక్‌లు, వ్యూస్ తో ఈ షో సరికొత్త రికార్డును సృష్టించింది.
Unstoppable : నెక్స్ట్ గెస్ట్ బ్రహ్మానందం..
మొదటి ఎపిసోడ్‌లోనే విలక్షణ నటుడు మోహన్ బాబుతో సందడి చేసిన బాలయ్య.. రెండో ఎపిసోడ్‌లో యువ నటుడు నానితో గోల గోల చేశాడు. దీంతో రానున్న ఎపీసోడ్ లపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం తాజాగా సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంతో షూట్ చేసిన ఈ షో ప్రోమో నెట్టింట్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందంతో పాటు హిట్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి హాజరుకానున్న ఈ షో ప్రోమో నవ్వులు పూయించెలా ఉంది.

balakrishna unstopable with nbk show create records
Unstoppable : త్వరలో మళ్ళీ బిజీగా బ్రహ్మానందం:
చూడబోతే మొదటి రెండు ఎపీసొడ్ ల కంటే మూడో ఎపీసోడ్ పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మానందం… త్వరలో మళ్ళీ బిజీగా మారనున్నట్లు తెలుస్తొంది. త్వరలో పంచతంత్ర, రంగ మార్తాండ సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు బాలయ్య బాబు అఖండంగా గర్జించనున్నారు. ఈ చిత్రంలో కంచే ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.