BalaKrishna : బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ 2కి టైం ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే..!

Authored By Sam C | The Telugu News | Updated on : 15 July 2022, 10:00 am

BalaKrishna : బాల‌కృష్ణ‌లోని కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేసిన షో అన్‌స్టాప‌బుల్. ఈ కార్య‌క్ర‌మంలో బాలయ్య చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ షో సీజన్‌ 1 గతేడాది నవంబర్‌ 4 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్‌ అయింది. తొలి సీజన్‌లో భాగంగా 10 ఎపిసోడ్లు వచ్చాయి. తన సినిమాలతో మాస్‌ ప్రేక్షకులను సంపాదించుకున్న బాలయ్య.. ఈ టాక్‌ షోతో మరింత మంది ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు. అన్‌స్టాపబుల్‌తో అతని ఫ్యాన్‌ బేస్‌ మరింత పెరిగింది. దీంతో రెండో సీజన్‌ తీసుకురావడానికి ఆహా ఓటీటీ ఏర్పాట్లు చేస్తోంది. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ ఆగస్ట్‌ నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని స‌మాచారం. అన్‌స్టాప‌బుల్ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సీజన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Balakrishna Unstoppable 2 for Time fix The first episode of the second season on August 15

Balakrishna Unstoppable 2 for Time fix The first episode of the second season on August 15

BalaKrishna : గుడ్ న్యూస్..

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్‌ 15న రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాలయ్య బాబు, అన్‌స్టాపబుల్‌ షో ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్‌న్యూసే. ప్రస్తుతం బాలకృష్ణ తన తర్వాతి మూవీ ఎన్‌బీకే 107లో నటిస్తున్నాడు. వచ్చే వారం షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎపిసోడ్ల షూటింగ్‌ జరగనుంది.గత సీజన్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో చివరి ఎపిసోడ్‌ నిర్వహించారు. ఆ ఎపిసోడ్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ సీజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవితో ప్రారంభించాలన్న ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి