BalaKrishna : నందమూరి బాలకృష్ణ లో మరో యాంగిల్ చూపించిన కార్యక్రమం అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినా ఆ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తనలోని కొత్త రూపాన్ని చూపించడంతో పాటు తనలో ఈ యాంగిల్ కూడా ఉంది అని చెప్పకనే చెప్పాడు. మొదట్లో బాలకృష్ణ టాక్ షో ఏంటి అంటూ అంతా నోరెళ్లబెట్టారు. కానీ ఆయన తనదైన శైలిలో అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లి సూపర్హిట్ అవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ ఏ రంగంలోకి దిగిన అద్భుతం అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ ను అభినందించారు.సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ఏ విధంగా అయితే చెప్తారో అలాగే ఆయన నిర్వహించిన అన్ స్టాపబుల్ లో కూడా అలాగే మాట్లాడాడు.
ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బాలకృష్ణ కూడా ఈ కార్యక్రమంపై చాలా అభిమానం పెంచుకున్నాడు. మొదట్లో 10 ఎపిసోడ్ ల వరకు కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. కాని ఆ తర్వాత కార్యక్రమాన్ని పెంచారు. ఇప్పుడు కొనసాగింపు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం ఈ కార్యక్రమం యొక్క రెండవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో అన్ స్టాపబుల్ 2 ప్రారంభించాలని అనుకున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ చాలా ఆసక్తిగా ఉండడం
పాటు ఆగలేకపోతున్న కారణంగా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. జులై లేదా ఆగస్టులోనే కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారని సమాచారం అందుతోంది. గత ఏడాది చివర్లో కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు మధ్య కనీసం ఏడాది కాలం ఉండేలా చూసుకుంటారు. కానీ నందమూరి బాలకృష్ణ ఆసక్తి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన ఆదరణ నేపథ్యంలో అర్ధ సంవత్సరం లోనే కార్యక్రమాన్ని సీజన్ 2 చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి అన్ స్టాపబుల్ సీజన్ లో 2 లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.