BalaKrishna : బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ 2 టైం ఫిక్స్.. ఎప్పటినుండి అంటే..!

Authored By Sam C | The Telugu News | Published on: June 15, 2022, 8:30 pm

BalaKrishna : బాల‌కృష్ణ అంటే మాస్ అనే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆయ‌న సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌త ఏడాది అఖండ సినిమ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బాల‌కృష్ణ ఇప్పుడు గోపిచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత అనీల్ రావిపూడితో సినిమా చేయ‌నున్నాడు. అయితే బాల‌య్య క్రేజ్ అమాంతం పెంచిన షో అన్‌స్టాప‌బుల్. ఇందులోని ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రతి ఒక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు నుంచి ఎన్నో విషయాలను రాబట్టారు బాలయ్య బాబు.
సంద‌డి షురూ కానుందా?ఆ తర్వాత వచ్చిన ఎపిసోడ్స్ నుంచి ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చారు.. చివరిగా మహేష్ బాబు తో ఈ ఎపిసోడ్ సీజన్-1 ముగిసింది. ఇక ఈ సీజన్ వన్ ముగిసే సమయంలో కచ్చితంగా సీజన్ టూ ఉండనే ఉంటుంది అని అందరూ భావించారు అలాగే అందుకు సంబంధించి హింట్ కూడా ఇచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది దసరా సందర్భంగా సీజన్-2 కి సంబంధించి మొదటి ఎపిసోడ్ విడుదల చేయబోతున్నట్లు ఆహా నుంచి , బాలయ్య సన్నిహితుల నుండి ఈ సమాచారం అందుతోంది.

balakrishna unstoppable starts soon

balakrishna unstoppable starts soon

తాజాగా ఆహ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో కూడా బాలయ్య పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర గురించి బాలయ్య బాబుని ప్రశ్నించగా చాలా పాజిటివ్ గా చెప్పడం జరిగింది. తప్పకుండా ఒక మంచి సీజన్ ను అన్ స్టాపబుల్ ప్రేక్షకులకు అందించ బోతున్నట్లుగా తెలియజేశారు బాలయ్యబాబు. సీజన్ టు ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది అనే విధంగా ఒక అప్డేట్ రావడం జరుగుతోంది. మరొక విషయం ఏమిటంటే ఇందులో చిరంజీవి మొదటి సారి గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం.

Sam C

No bio available for this author.

  1. "Adarsha Kutumbam : వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’కు కాపీరైట్ చిక్కులు.. అసలేం జరిగింది..?"

  2. "Breakup : మూడేళ్ల ప్రేమకు ముగింపు.. స్టార్ హీరో కొడుకుతో ఆ హీరోయిన్ కూతురు లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్..!"

  3. "Vijayawada Mayor Election : విజయవాడ మేయర్ పోరు రసవత్తరం.. కూటమి, వైసీపీకి ఏబీవీ సవాల్!"

  4. "10th New Rules : 10వ తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్!"

  5. "YS Sharmila : యలహంక ఇల్లు నాదే.. జగన్‌కు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్.. ఆస్తుల వివాదంపై కీలక ట్వీట్!"

  6. "Cheyutha Pension : తెలంగాణ చేయూత పింఛన్లపై గుడ్‌న్యూస్.. వారికి వెంటనే పెన్షన్ !"

  7. "Bigg Boss Telugu 10 : ఈ వారం కూడా వర్షిణీ సేఫ్.. ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp