Home » Entertainment » Balakrishna Warning To Young Director Unstoppable
Entertainment

Unstoppable : యంగ్ డైరెక్టర్‌కు బాలకృష్ణ మాస్ వార్నింగ్.. ఏ విషయంలోనంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: December 30, 2021, 10:20 am
Advertisement

Unstoppable : నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా వసూళ్ల వేట కొనసా..గుతోంది. ఇప్పటికే రూ.125 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ పిక్చర్‌ను మిరియాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేయగా, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. నందమూరి బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీలో బాలయ్య సరసన ప్ర‌గ్య జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.

Advertisement

‘అఖండ’ ఫిల్మ్‌లో బాలయ్య ‘అఘోర’గా అత్యద్భుత పాత్ర పోషించారని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను అంచనా మించి ఉందని, బాలయ్య, బోయపాటి కాంబో అంచనాలను అందుకుందని అంటున్నారు. ఇకపోతే బాలయ్య నెక్స్ట్ మూవీస్ లైనప్ కూడా రెడీగా ఉన్నాయి. బాలయ్య నెక్స్ట్.. ‘క్రాక్’ డైరెక్టర్ మలినేని గోపీచంద్, ‘ఎఫ్ 3’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ‘ఆహా’ ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’ షోకు గోపీచంద్ గెస్ట్‌గా హాజరయ్యాడు.బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో గోపీచంద్ మలినేని, మాస్ మహారాజా రవితేజ పాల్గొన్నారు.

balakrishna warning to young director Unstoppable

Advertisement

Unstoppable : అలా చేయకపోతే డైరెక్టర్‌ను చంపేస్తానన్న బాలయ్య…!

కాగా, షో ఎంట్రీలోనే గోపీచంద్ మలినేనికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చేశాడు. తాను చేయబోయే నెక్స్ట్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ ఇవ్వాలని లేదంటే చంపేస్తానంటూ సరాదాగా వార్నింగ్ ఇచ్చేశాడు బాలయ్య. బాలయ్య ఈ క్రమంలోనే సరదాగా గోపీచంద్ దగ్గరకు వెళ్లి తన చేతులతోనే కత్తితో పొడుస్తున్నట్లుగా వార్నింగ్ ఇచ్చాడు. ఇకపోతే ఈ షోలో తాను ‘సమర సింహారెడ్డి’ ఫిల్మ్ టికెట్ కోసం అరెస్ట్ అయి, ఓ రోజంతా జైలులో గడిపిన సంగతిని గోపీచంద్ గుర్తు చేసుకున్నాడు. ‘జై బాలయ్య’ సాంగ్‌కు బాలయ్య, రవితేజ చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను విపరీగతంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి