omkar will be host for bigg boss 5 telugu ott season
Bigg Boss OTT Omkar : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ ఇటీవల పూర్తి అయిన సంగతి అందరికీ విదితమే. కాగా, త్వరలో మరో సీజన్ రాబోతుందని నాగార్జున ప్రకటించారు. ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్ ఓటీటీ’ కూడా రాబోతుందని వార్తలొస్తున్నాయి. కాగా, ఓటీటీ రియాలిటీ షోకు ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వార్తలొస్తున్నాయి. దాంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్‌గానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటిన బిగ్ బాస్ షోలోనూ అలరిస్తారని అంటున్నారు.ఓంకార్‌కు బుల్లితెరపైన ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తను హోస్ట్ చేసిన షోస్ అన్నిటినీ సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేస్తారు ఓంకార్.
‘ఆట, ఇస్మార్ట్ జోడీ, సిక్స్త్ సెన్స్, మాయా ద్వీపం’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో టీఆర్పీ రేటింగ్స్ కొల్లగొట్టేస్తుంటారు ఓంకార్. ఓఏకే ఎంటర్ టైన్మెంట్స్ స్టార్ట్ చేసి సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతున్నాడు ఓంకార్. ఇకపోతే ఓంకార్ చేతికి ఈ క్రమంలోనే ‘బిగ్ బాస్’ ఓటీటీ పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్. అదే కాని నిజం అయితే ‘ఓటీటీ బిగ్ బాస్’కూ యమ క్రేజ్ ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగిసిన వెంటనే మరో రెండు నెలల్లో న్యూ సీజన్ ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఓటీటీ బిగ్ బాస్ ఉంటుందని చెప్పారు. కాగా, సీజన్ 6కు కూడా తానే హోస్ట్‌గా వ్యవహరిస్తానని నాగార్జున తెలిపాడు.
omkar will be host for bigg boss 5 telugu ott season
కానీ, ఓటీటీ బిగ్ బాస్ గురించి తెలపలేదు. హిందీలో మాదిరిగా బిగ్ బాస్ ఓటీటీ తెలుగులోనూ డిఫరెంట్ హోస్ట్ ఉంటారని కొందరు గెస్ చేస్తున్నారు.హిందీ భాషలో ‘బిగ్ బాస్’ను సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా, ఓటీటీ బిగ్ బాస్‌ను కరణ్ జోహార్ హోస్ట్ చేశారు. ఆ మాదిరిగానే తెలుగులో నాగార్జున సీజన్ 6 కు హోస్ట్‌గా ఉంటుండగా, ఓటీటీకి ఓంకార్ హోస్ట్ అవుతారని పలువురు చెప్తున్నారు. చూడాలి మరి.. ఈ వార్తలో నిజమెంత ఉంది అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ తర్వాతే తేలనుంది. ఇకపోతే ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా వెరీ డిఫరెంట్‌గా ఉంటారట. ఆ లిస్టులో అగ్గిపెట్టి మచ్చా, కత్తర్ పాప, యాంకర్ శివ, ఉప్పల్ బాలు తదితరులు ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.