Taraka Ratna : తారకరత్న చనిపోయాక బాలయ్య అన్న మొట్టమొదటి మాట ఇదే..!!
Taraka Ratna ; నందమూరి తారకరత్న గుండెపోటు కారణంగా నిన్న శనివారం మృతి చెందారు. నారా లోకేష్ కు మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించగా అక్కడ సుమారుగా 23 రోజులపాటు అత్యవసర వైద్యం అందించారు. ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18 న మృతి చెందారు. అయితే జనవరి 27న తారకరత్న గుండెపోటుకు గురైన సమయం నుంచి మృతి చెందే వరకు అతడిని బతికించడానికి బాలకృష్ణ ఎంతో తపనపడ్డారు.
తారకరత్నకు బెంగళూరు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించే వరకు బాలకృష్ణ అక్కడే ఉండిపోయారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేవారు. అటు సోదరుడు కుటుంబానికి ధైర్యం చెబుతూ అభిమానులు ఆందోళన చెందకుండా మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆ సమయంలో బాలకృష్ణ రెండు సార్లు మాత్రమే ఇంటికి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మనకు తెలిసిందే బాలకృష్ణ రాజకీయాల పరంగా, సినిమా పరంగా ఎంత బిజీగా ఉంటాడో. అవన్నీ వాయిదా వేసుకుని బాలయ్య తారకరత్న వద్ద గడిపిన పరిస్థితిని తెలుసుకొని రాజకీయ ప్రత్యర్థులు సైతం అభిమానించారు. అటు సోషల్ మీడియాలో కూడా జనాలు బాలయ్యకు అభినందనలు తెలుపుతున్నారు.
తారకరత్న ఆసుపత్రి చేరిన రోజు నుంచి చివరి రోజు వరకు అయ్యే ఖర్చులను బాలకృష్ణ భరించినట్లు సమాచారం. తారకరత్నను కాపాడుకోవాలని బాలయ్య ఎంతో తపించారు. ప్రయత్నంలో ఎక్కడ లోపం జరగలేదు. డాక్టర్స్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. కానీ తారకరత్న దక్కలేదు. కానీ బాలయ్య చేసిన ప్రయత్నాలు చివరి నిమిషం వరకు అన్ని తానై వ్యవహరించిన తీరు మాత్రం ప్రస్తావించకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. తారకరత్న పరామర్శించడానికి వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడ పరిస్థితిని చూసి మీడియాతో మాట్లాడుతూ తారకరత్న విషయంలో బాలకృష్ణ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.