Shyam Singha Roy : ‘శ్యామ్ సింగరాయ్’కి అండగా ‘అఖండ’.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య..

Authored By mallesh | The Telugu News | Published on: December 18, 2021, 9:40 pm

Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఫిల్మ్ ఈనెల 24 న విడుదల కానుంది. ఈ సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారు. నాని ఇటీవల ‘ఆహా’ అన్ స్టాపెబుల్ షోకు అతిథిగా హాజరై ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య నానిని సపోర్ట్ చేసేందుకుగాను ‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని అభిమానులతో ముచ్చటించి, మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.ఈ నెల 2న ‘అఖండ’ చిత్రం విడుదలైన సంగతి అందరికీ విదితమే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన రెస్పాన్స్ వచ్చింది.

‘అఖండ ’ఫిల్మ్ తర్వాత వరుసగా చిత్రాల విడుదల కొనసా..గుతున్నాయి. శుక్రవారం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. ‘అన్ స్టాపెబుల్’ షోలో నాని తన జీవితంలో జరిగిన సంఘటనలను బాలయ్యతో షేర్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలోని ‘ఫ్లూటు జింక ముందు..ఊదు’ అనే డైలాగ్ చెప్పాడు. ఇక బాలయ్య సైతం నాని గురించి అత్యద్భుతంగా అభివర్ణించాడు. సెల్ఫ్ మేడ్‌కు సర్ నేమ్ ‘నాని’ అంటూ ఇంట్రడ్యూస్ చేసి.

balayya supporting shyam singha roy film

balayya supporting shyam singha roy film

Shyam Singha Roy : ‘అఖండ’తో మొదలైన సినిమాల పండుగ..

.. ఆ తర్వాత నానిని కుశల ప్రశ్నలు వేసి తర్వాత సినీ కెరీర్ గురించి అడిగారు. అలా మొత్తంగా సీనియర్ హీరో బాలయ్యతో నేచురల్ స్టార్ నాని ఓ బాండ్ అయితే క్రియేట్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే నాని సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ సపోర్ట్ చేసేందుకుగాను బాలయ్య ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ‘ట్యాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ పిక్చర్‌లో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్స్‌గా సాయిపల్లవి, కృతిశెట్టి మడోనా సెబాస్టియన్ నటించారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp