Samantha : ‘పుష్ప’ స్పెషల్ సాంగ్ కోసం సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ శుక్రవారం విడుదలై దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బ్లాక్ బాస్టర్ దిశగా వెళ్తోంది. థియేటర్స్‌లో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఈ పిక్చర్‌లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ‘ఊ అంటావా మావా’ అంటూ సాంగే పాటకు సమంత ఎక్సలెంట్ స్టెప్స్ వేసి బన్నీ డ్యాన్సింగ్ స్టైల్‌ను మ్యాచ్ చేసింది.సుకుమార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఫుల్ క్రేజ్ ఉంటుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఈ ఐటెం సాంగ్ ప్లాన్ చేయగా, ఇందులో సమంత ఐటెం గర్ల్‌గా సాంగ్‌లో కనబడింది. డ్యాన్స్ మూమెంట్స్‌లో అల్లు అర్జున్‌ను మ్యాచ్ చేయడానికిగాను సమంత చాలా కష్టపడినట్లు సాంగ్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇకపోతే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికిగాను సమంత రూ.1.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ఈ విషయం తెలుసుకుని సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఒక సాంగ్ కోసం అన్ని కోట్ల రూపాయలు తీసుకుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా, సమంత రేంజ్ అదే మరి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

samantha took huge remuneration for special song in pushpa film
Samantha : సాంగ్ షూట్ కోసం అంత ఖర్చా.. వామ్మో…
ఇక ఈ ‘ఊ అంటావా మావా’ సాంగ్ కోసం మేకర్స్ స్పెషల్ సెట్ డిజైన్ చేసి వేయించారు. ఇందులో వేసే సెట్స్‌కు గాను రూ. 5 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ సాంగ్ మేకింగ్‌లో అస్సలు వెనుకడుగు వేయొద్దు అని అనుకున్నారట. అలా ఈ సాంగ్ కోసం మేకర్స్ చాలానే ఖర్చు పెట్టేశారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ భామ రష్మిక మందన నటించింది. కీలక పాత్రల్లో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫాహద్ ఫాజిల్ కనిపించారు.
