Bandla Ganesh : అల్లు అర్జున్ మీద బండ్ల గణేశ్ తీవ్ర కామెంట్లు.. ఏంటి అంత మాట అనేశాడు?

Authored By Breaking News 2 | The Telugu News | Updated on : 5 December 2022, 12:20 pm

Bandla Ganesh : బండ్ల గణేశ్ గురించి తెలుసు కదా. నిజానికి… కమెడియన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బండ్ల గణేశ్. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చివరకు నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాడు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు కదా. గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేశ్ కెరీరే మారిపోయింది. నిజానికి బండ్ల గణేశ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అందుకే పవన్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో.. బండ్ల గణేశ్ కు అంత ఫాలోయింగ్ ఉంది. పవన్ ను ఆయన ముద్దుగా దేవుడు దేవుడు అని పిలుస్తుంటాడు.

ఆయన మాకు దేవుడు.. మేము ఆయన భక్తులం అని పవన్ ను ఉద్దేశించి బండ్ల గణేశ్ పలు సందర్భాల్లో చెప్పిన మాట తెలిసిందే కదా.బండ్ల గణేశ్ మాటలు చాలా వాక్చాతుర్యంతో కూడుకుంటాయి. ఆయన పలు యూట్యూబ్ చానెల్స్ లో ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసే ఉంటాం. తన మనసులో ఏది ఉంటే అది మాట్లాడుతారు గణేశ్. అందుకే ఆయన్ను ముక్కుసూటి మనిషి అని అంటారు. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా కూడా అలాగే ఉంటుంది. తాజాగా ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh comments on icon star allu arjun

Bandla Ganesh comments on icon star allu arjun

Bandla Ganesh : తండ్రి మాట వింటే అల్లు బాబీలా అవుతారన్న బండ్ల గణేశ్

ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అల్లు బాబీ కొడుకు పెళ్లి హైదరాబాద్ లో జరగగా… పెళ్లికి బండ్ల గణేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు బాబీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేశ్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రి మాట వింటే సాదాసీదా జీవితంతో ఇదిగో ఇలా అల్లు బాబీ గారెలా ఉంటారు. కానీ.. తండ్రి మాట వినకపోతే అల్లు అర్జున్ లాగా పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ గా మారిపోతారు. కాబట్టి తండ్రి మాట ఎవ్వరూ వినకండి.. అంటూ బండ్ల గణేశ్ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి