Bandla Ganesh : బండ్ల గణేష్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కమెడీయన్‌గా కెరీర్ స్టార్ చేసిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా రాణించాడు. ఇక సోషల్ మీడియలో పవన్ జపం చేస్తూ ఎప్పుడు వార్తలలో నిలుస్తుంటాడు. ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యాపారం చూసుకుంటూనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటారు బండ్ల గణేష్. సామజిక మాధ్యమాల్లో నిత్యం ఆయన పెట్టే ట్వీట్స్ వైరల్ అవుతుంటాయి. ట్విట్టర్‌లొ తనదైన కోణంలో పోస్టులు పెట్టడం బండ్లన్న నైజం.పవన్ కళ్యాణ్‌పై ఈగ వాలినా కూడా అస్సలు ఒప్పుకోరు బండ్లన్న. పవన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా వెంటనే రియాక్ట్ అవుతూ కౌంటర్లు వేస్తుంటారు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ నా దేవుడు అని చెబుతూ హల్చల్ చేస్తుంటారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ట్వీట్టర్‌లో ఈ ఆడియో టేప్‌ను విడుదల చేశాడు. జీవితంలో ఎవరినీ నమ్మొద్దు అంటూ బండ్ల చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఉన్నటుండి ఆయన ఈ ఎందుకు ఉపోద్ఘాతం ఇస్తున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఎవరిని నమ్మొద్దని.. మనల్ని మనం నమ్ముకుందామని బండ్ల గణేష్ అన్నాడు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్ముకుందామని చెప్పాడు. భార్యను, మనం జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దామన్నాడు. మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దామన్నాడు. మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉన్నారని అన్నాడు. మన పిల్లలకు మంచి దారి చూపిద్దామన్నారు. వాళ్ల.. వీళ్ల మోజులో పడి మన పిల్లలను, మన అమ్మనాన్నలను అన్యాయం చేయొద్దంటూ బండ్ల గణేష్ ఆడియోలో పేర్కొన్నాడు.
ఏమైంది గణేష్ అన్న.. ఏమైనా ఎదురుదెబ్బ తగిలిందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏమైన హ్యాండ్ ఇచ్చాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. . పవన్ కళ్యాణ్ భక్తుడిగా సగర్వంగా చెప్పుకునే బండ్ల గణేష్ ఇప్పుడిలా పవన్ పేరు ప్రస్తావించకుండా జీవితంలో ఎవ్వడినీ నమ్మొద్దు అనడం పలు అనుమానాలకు తావిచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటిన బండ్ల గణేష్.. ప్రొడ్యూసర్‌గా మారి పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించాడు. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ హీరోలతో సూపర్ హిట్ సినిమాలను తీశాడు. ఇటీవల బండ్ల గణేష్ హీరోగానూ ట్రై చేశాడు. ‘డేగల బాబ్జీ’ సినిమాలో హీరోగా నటించాడు. అయితే ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆశించిన స్పందన రాలేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.