Bandla Ganesh : సుమ అందానికి రహస్యం ఇదే.. బండ్ల గణేష్ మామూలోడు కాదు క్యాష్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 22 May 2022, 5:30 pm

Bandla Ganesh యాంకర్ సుమ బుల్లితెరపై ఎన్నో ఏళ్లు అప్రతిహతంగా దూసుకుపోతూనే ఉంది. తెలుగులో టాప్ యాంకర్ అనే మాటే వినిపించదు. ఎందుకంటే అది సుమకు సొంతమైంది. సుమకు ధీటుగా ఎంతో మంది అందంతో ఆకట్టుకునేందుకు వచ్చారు. కానీ సుమ వాగ్దాటి ముందు ఎవ్వరూ నిలబడలేకపోయారు. అలా సుమ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నెంబర్ వన్‌గా దూసుకుపోతూనే ఉంటుంది. అయితే సుమ వయసు మీద ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. సుమ కూడా తన వయసుని బయట పెట్టేందుకు అంతగా ఇష్టపడదు.

Bandla Ganesh Satires on Anchor Suma Beauty secret in cash Show

Bandla Ganesh Satires on Anchor Suma Beauty secret in cash Show

ఎప్పుడూ తన వయసు పదహారే అన్నట్టుగా చెబుతుంటుంది. ఇక సుమ తన అందం మీద కూడా ఎన్నో సెటైర్లు వేసుకుంటుంది. మేకప్ వేసుకుంటానని, మేకప్ లేకపోతే చూడలేరంటూ తన మీద తానే కౌంటర్లు వేసుకుంటుంది. అయితే తాజాగా క్యాష్ షోలో తన అందం మీద చర్చ వచ్చింది. వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు. ఇందులో భాగంగా బండ్ల గణేష్ సుమ అందం గురించి కామెంట్ చేశాడు.

బండ్ల గణేష్‌కు కోళ్ల ఫాంలున్నాయని తెలిసిందే. అయితే ఈ షోలో భాగంగా టమాటల రేటు ఎంత అని సుమ అడుగుతుంది. అవన్నీ మాకు తెలియవు.. కోడిగుడ్డు ధర ఎంతో అడగండి చెబుతాం అని అంటాడు బండ్లన్న. దీంతో సుమతో పాటు మిగతా అందరూ నవ్వుతారు. మీరు పంపే గుడ్లతోనే అందరం తింటున్నాం అని సుమ అంటే.. అవును మరి కోడిగుడ్డు లేకపోతే జీవితం లేదు.. ఆ కోడి గుడ్లు తినే ఇంత అందంగా తయారయ్యావ్ అని బండ్ల గణేష్ అంటాడు. దీంతో మధ్యలోకి సమీర్ ఎంట్రీ ఇస్తాడు.

ఇన్నాళ్లకు సుమ అందానికి రహస్యం తెలిసింది.. కోడి గుడ్లన్న మాట అని సమీర్ కౌంటర్ వేస్తాడు. ఈ రోజు అద్దంలో చూసుకుంటే నాకు నేను కోడిలా కనిపిస్తానా? అని సుమ తన మీద తానే సెటైర్ వేసుకుంది. దీంతో బండ్ల గణేష్, సమీర్ పగలబడి నవ్వేస్తుంటారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp