Pawan Kalyan : ఆఖరి నిమిషం లో పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చిన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ !

Authored By aruna | The Telugu News | Published on: July 4, 2023, 8:00 pm

Pawan Kalyan : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య ప్రజలే కాదు ఆయన సెలబ్రిటీలలో కూడా ఫాన్స్ ఉంటారు. అందులో ఒకరే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. ఇక చాలాసార్లు పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానిని అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చెబుతూ ఉంటారు. అంతేకాకుండా తన ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ నీ ఎవరైనా ఏమైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే అనవసరంగా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కి పెద్ద భక్తుడు అయిన బండ్ల గణేష్ గత కొన్ని రోజులుగా ఆయనను దూరం పెడుతూ వస్తున్నారు.

దీనికి కారణం ఏంటో తెలియదు కానీ బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటున్నారు. బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ కి మంచి అనుబంధం ఉంది. బండ్ల గణేష్ నిర్మాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆయనకు అవకాశం ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు వచ్చాయి. అందులో గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత కలిసి సినిమా చేయలేదు. అయినా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. నెలా రెండు నెలలకు ఒకసారి అయినా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కలిసేవారు. అయితే భీమ్లా నాయక్ సినిమా ఈవెంట్ కారణంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తుంది.

Bandla Ganesh tweets on Pawan Kalyan

Bandla Ganesh tweets on Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడైన త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాకు ఆహ్వానం లేదు త్రివిక్రమ్ కావాలని నన్ను రాకుండా చేస్తున్నాడని ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీక్ అయింది. ఈ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని కలిసింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం గణేష్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఉండేవాడు. తాజాగా ఆయన మళ్ళీ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ మీ స్థాయి తెలిసినవాడిగా చెబుతున్నా మీరు కోరుకున్న లక్ష్యం చేరుకుంటారు. నేను ఇకపై మీ కీర్తి, పేరు ఏ విధంగా వాడుకోను లబ్ది పొందాలని చూడను అని ట్వీట్ చేశారు.

aruna

No bio available for this author.

  1. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  2. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  3. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

  4. "Apple Pay India : పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తర్వాత కొత్త పేమెంట్ ఆప్షన్.. ఎవరు వాడొచ్చంటే?"

  5. "kannababu : దమ్ముంటే గ్రామ సచివాలయాలను రద్దు చేయండి.. కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఓపెన్ ఛాలెంజ్!"

  6. "Nara Lokesh : సీఎం చంద్రబాబు ఏ దేశం వెళ్లారో తెలుసా? వైసీపీ పోస్ట్‌కు నారా లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్..!"

  7. "Hyderabad POCSO Case : 13 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి.. టీచర్‌కు జీవిత ఖైదు"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp