జాన్వీ కపూర్ అందాల తార శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత తన టాలెంట్ తో నే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ధడక్ సినిమా తో బాలీవుడ్ కి పరిచయం అవుతున్న సమయంలో చాలామంది జాన్వీ కపూర్ ని తల్లి శ్రీదేవి తో పోల్చుకుంటూ రక రకాల కామెంట్స్ చేశారు. కానీ అలా కామెంట్స్ చేసిన వాళ్ళకి ఫస్ట్ సినిమా తోనే గట్టి షాకిచ్చింది జాన్వీ కపూర్. డెబ్యూ సినిమాగా వచ్చిన ధడక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జాన్వీ కపూర్ ఏమాత్రం ఆలోచించకుండా డేరింగ్ స్టెప్ వేసి వెబ్ సిరీస్ లో కూడా నటించింది.
‘ఘోస్ట్ స్టోరీస్’ అన్న టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అన్న బయోపిక్ లో నటించిన జాన్వీ ఈ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసి అద్భుతంగా నటించిందన్న పేరు తెచ్చుకుంది. లాక్ డౌన్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన ఈ సినిమాతో జాన్వీ కపూర్ భారీ హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన ‘రూహి అఫ్జనా’ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.
ఇలా జాన్వీ కపూర్ నటనలో .. ప్రయోగాలు చేయడంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఒకవైపు క్రేజీ మూవీస్ మరొకవైపు వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతోంది. కాగా జాన్వీ సినిమా ఎంట్రీ ఇస్తుందన్నప్పటి నుంచి మన టాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ కి తీసుకు రావాలని ట్రై చేస్తున్నారు. కానీ జాన్వీ కపూర్ మన టాలీవుడ్ హీరోలకి పర్‌ఫెక్ట్ గా సెట్ కావడం లేదన్న కారణంగా ఎప్పటికప్పుడు టాలీవుడ్ ఎంట్రీ వెనక్కి వెళుతూ వస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అఖిల్, ఎన్.టి.ఆర్ ల సినిమాలలో అనుకున్నారన్న టాక్ వచ్చింది. కానీ ఇంతవరకు జాన్వీ కపూర్ ని ఎవరూ టాలీవుడ్ కి తీసుకు రాలేకపోతున్నారు. చూడాలి మరి జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.