Agent Movie : ఈ వ్యక్తి వల్లే ఏజెంట్ సినిమా సర్వ నాశనం అయ్యింది !

 Authored By prabhas | The Telugu News | Updated on :30 April 2023,4:00 pm

Agent Movie : అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా ‘ ఏజెంట్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ని సంపాదించుకుంది. హీరోగా అఖిల్ ఎంత కష్టపడినా తగిన ఫలితం లభించలేదు. దీనికి కారణం డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని జనాలు అంటున్నారు. ధ్రువ సినిమాతో హిaట్టు ఇచ్చాడని చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా చేశాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Because of this man Agent movie was ruined

Because of this man Agent movie was ruined

ఏజెంట్ సినిమా విషయంలో సురేందర్ రెడ్డి తప్పులు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి సినిమా అంటే చూడాల్సిన రేసీ స్క్రీన్ ప్లే ట్విస్టులు అవేమి ఏజెంట్ సినిమాలో కనిపించలేదు. ఏజెంట్ కథ బాగానే ఉంది కాని కాస్టింగ్ విషయంలో పెద్ద తప్పు జరిగిందని అంటున్నారు. హీరోయిన్, విలన్ ఈ సినిమాకు అస్సలు సూట్ అవ్వలేదు అని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ఈ సినిమాకు లెక్కకు మించి రీ షూట్ ల వల్ల క్లారిటీ మిస్ అయ్యిందని, సినిమా రిలీజ్ పది రోజులు ముందు ఫైనల్ కాపీ చూశాక డైరెక్టర్ మళ్లీ రీ షూట్ చేస్తానని నిర్మాతను అడిగాడని టాక్.

Agent movie censor review : వాళ్ళ 3గ్గురి పాత్ర ఇలా ఉండటం వల

ఈ సినిమాలో అఖిల్ బాగానే కనిపించినా దర్శకుడిగా సురేందర్ రెడ్డి సక్సెస్ కాలేకపోయాడు. ఏజెంట్ సినిమా డిజాస్టర్ సురేందర్ రెడ్డి ఖాతాలోకి వెళుతుందని చెప్పవచ్చు. హీరోగా అఖిల్ సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. కిక్, రేసుగుర్రం, ధ్రువ లాంటి సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి ఏజెంట్ లాంటి ఒక స్పై థ్రిల్లర్ సినిమాను చాలా రొటీన్ గా కమర్షియల్ గా తీశాడు అని జనాలు అంటున్నారు. ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి మరోసారి బిగ్గెస్ట్ డిజాస్టర్ వేసుకున్నాడు అని జనాలు చెప్పుకొస్తున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి