Akkineni Akhil : అఖిల్ పెళ్లికి చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు.. పెళ్లి ఎక్కడ, ఎప్పుడు ?
ప్రధానాంశాలు:
Akkineni Akhil : అఖిల్ పెళ్లికి చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు.. పెళ్లి ఎక్కడ, ఎప్పుడు ?
Akkineni Akhil : అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఏఎన్ఆర్ మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని పెళ్లి పనులు జోరుగా, హుషారుగా సాగుతున్నాయి. రాజకీయ సినిమా ప్రముఖులకు నాగర్జున – అమల దంపతులు స్వయంగా శుభలేఖలు అందజేస్తున్నారు. జూన్ 6వ తేదీన అఖిల్ అక్కినేని వివాహం జరగనుంది.

Akkineni Akhil : అఖిల్ పెళ్లికి చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు.. పెళ్లి ఎక్కడ, ఎప్పుడు ?
Akkineni Akhil చంద్రబాబుకి పిలుపు..
అన్నపూర్ణ స్టూడియోలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య ఘనంగా పెళ్లి వేడుక చేసేందుకు అక్కినేని కుటుంబం సిద్ధమైంది. తాజాగా సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. వివాహ పత్రిక అందజేశారు
గతేడాది నవంబర్‌లో అక్కినేని అఖిల్‌కు జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరు జూన్ 6న పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు సమాచారం. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టేడియోలోనే సింపుల్‌గా జరగనున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది.