Chatrapathi Movie : చత్రపతి తీశావా? చందమామ తీశావా?.. అప్పుడే ఎలా ముగించార్రా బాబోయ్‌! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chatrapathi Movie : చత్రపతి తీశావా? చందమామ తీశావా?.. అప్పుడే ఎలా ముగించార్రా బాబోయ్‌!

 Authored By himanshi | The Telugu News | Updated on :4 January 2022,11:30 am

Chatrapathi Movie : టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దాదాపు దశాబ్ద కాలం క్రితం వచ్చిన చత్రపతి సినిమాను ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి వి వినాయక్‌ హిందీ లో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. చత్రపతి సినిమా అంటే అప్పట్లోనే భారీ బడ్జెట్‌ సినిమా.. అంతే కాకుండా సినిమాను అత్యంత హై టెక్నికల్‌ వ్యాల్యూస్ తో దాదాపు ఏడాది కాలం పాటు జక్కన్న తెరకెక్కించినట్లుగా ప్రచారం జరిగింది.

అలాంటి సినిమా ను ఇప్పుడు అంతకు మించి టెక్నాలజీని వాడుతూ భారీ ఎత్తున విడుదల చేయాల్సి ఉంది. కాని వీళ్ల రీమేక్‌ పని తీరు చూస్తుంటే టాలీవుడ్ చత్రపతిలో కనీసం 50 శాతం కూడా హై తీసుకు రాలేక పోతారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మొన్ననే చత్రపతి ని ప్రారంభించారు.. మద్య మద్య లో కరోనా వల్ల షూటింగ్‌ పెద్దగా జరిగిన తీరే లేదు. అయినా కూడా చత్రపతి సినిమా షూటింగ్‌ ను ముగించేశాం.. త్వరలో తీసుకు వస్తాం అంటూ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. నెటిజన్స్ వీళ్లు అసలు చత్రపతి సినిమా ను రీమేక్ చేశారా.. లేదం చందమామ కథలు వంటి చిన్న సినిమా ను రీమేక్ చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.

bellamkonda sai srinivas chatrapathi movie shooting completed

bellamkonda sai srinivas chatrapathi movie shooting completed

Chatrapathi Movie : ప్రభాస్‌ చత్రపతి పరువు తీస్తారా..!

ప్రభాస్‌ నటించిన చత్రపతి లాంటి సినిమా లకు ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటేనే అద్బుత కళా కండాలుగా తెరపై చూపించగలరు. కాని వినాయక్‌ తన స్టైల్‌ లో కేవలం రెండు మూడు నెలల్లో సినిమాను ముగిస్తే జనాలు చూస్తారా లేదా అనేది అనుమానంగా నే ఉంది. అయితే కొందరు మాత్రం సినిమా షూటింగ్ ఇలా త్వరగా పూర్తి అవ్వడమే మంచి పద్దతి అంటున్నారు. ఎందుకంటే పాతిక కోట్ల లోపు బడ్జెట్‌ తో సినిమా ను పూర్తి చేస్తేనే బెల్లంకొండ బాబు మార్కెట్‌ కు ఒక మోస్తరు అన్నట్లుగా చెబుతున్నారు. హిందీ లో బెల్లం బాబుకు ఇమేజ్.. క్రేజ్ జీరో. అయినా కూడా పాతిక కోట్ల రూపాయలతో సినిమాను నిర్మించారు.

ఒక వేళ సినిమా అటు ఇటు అయితే ఖచ్చితంగా ఆ పాతిక కోట్లలో కనీసం 15 నుండి 20 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలీవుడ్ లో ఇంత హడావుడిగా తీసి ముగించేసిన హిందీ చత్రపతి సినిమా ను ఎప్పుడు వదులుతారు అనేది చూడాలి. సినిమా ల విడుదల కు అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. కనీసం మూడు నెలల వరకు అక్కడ సినిమాలు విడుదల అయ్యే అవకాశం లేదు. కనుక హిందీ చత్రపతి విడుదల అయ్యేందుకు కనీసం ఆరు నెలలు పట్టవచ్చు.. అంతకు మించే పట్టవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది