R Narayana Murthy : మొన్నటికి మొన్న టాలీవుడ్ నటీ నటుల సంఘం మా ఎన్నికల సందర్బంగా మా ప్రెసిడెంట్ పోస్ట్ కోసం నేనంటే నేను అంటూ ఎలా కొట్టుకున్నారో ఇప్పుడు అలాగే ఇండస్ట్రీ పెద్దన్న పోస్ట్ కు కూడా చర్చ జరుగుతోంది. అయితే చిరంజీవి మాత్రం ఆ పెద్దన్న పోస్ట్ వద్దంటే మోహన్ బాబు మాత్రం నేనున్నా అంటూ నామినేషన్ పత్రం వేసినట్లుగా ఒక లేఖను ఇండస్ట్రీకి రాశాడు. టికెట్ల రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వంను అడగాల్సింది పోయి ఆయన్ను అడిగే దమ్ము ధైర్యం లేదో మరేంటో కాని వచ్చి ఇండస్ట్రీకి మోహన్ బాబు లేఖ రాశాడు.ఏదైనా ఉంటే నేరుగా వెళ్లి జగన్ ప్రభుత్వంను అడగాలి.. నిలదీయాలి. కాని మోహన్ బాబు మాత్రం అలా చేయకుండా హైదరాబాద్ లో పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదే సమయంలో సినిమా థియేటర్ల సీజ్ విషయంలో నిర్మాతలు మరియు థియేటర్ల యజమానులు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఎర్రన్న ఆర్ నారాయణ మూర్తి నేరుగా అమరావతి వెళ్లి సమస్య పరిష్కారంకు ప్రయత్నించాడు. పేర్ని నానిని కలిసిన ఎర్రన్న సీఎం వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడాడు. దాంతో వెంటనే సీజన్ అయిన అన్ని థియేటర్లను కండీషన్ లేకుండా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.నెల రోజుల సమయం ఇచ్చి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. ఇది ఖచ్చితంగా ఆర్ నారాయణ మూర్తి వల్లే జరిగింది అని ఇండస్ట్రీ మొత్తంకు తెలుసు. ఏ ఒక్కరు కూడా ఇలాంటి పని చేయలేదు. ఇక ఆర్ నారాయణ మూర్తి టికెట్ల రేట్ల విషయంలో కూడా పోరాటం చేస్తున్నాడు. ఆయన కమర్షియల్ గా సంపాదించుకునే ఆలోచన లేదు. అయినా కూడా నా ఇండస్ట్రీ బాగుండాలని ఆయన కోరుకుంటాడు.
ఆయన వంటి నిస్వార్థ పరులు ఇండస్ట్రీ కోసం ఎంతో చేస్తారు. అందుకే అలాంటి వారిని ఇండస్ట్రీ పెద్దన్నగా ముందు ఉంచి నడపాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని మన స్టార్స్ ఈగో లతో పెద్దన్న పాత్రను మూర్తన్న కు అస్సలు ఇవ్వరు. నారాయణ మూర్తి కనుక ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తే అన్ని వ్యవహారాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాలతో మాట్లాడుతూ అందరికి సమాన అవకాశాలు.. వినోదం అందరికి దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్న ఆర్ నారాయణ మూర్తి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనే అభిప్రాయంలో మీ అభిప్రాయం ఏంటి మాకు చెప్పండి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.