Bhagyashri Borse : ” నా తల్లి ” అంటూ.. ఎక్కి ఎక్కి ఏడ్చిన భాగ్యశ్రీ..!
Bhagyashri Borse లెనిన్ సినిమాతో తొలి భారీ విజయాన్ని అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సినిమాల్లోకి రావాలనే నిర్ణయాన్ని కుటుంబం వ్యతిరేకించడంతో తల్లి ఆరు నెలలు..
Bhagyashri Borse : టాలీవుడ్‌లో ఒక్క విజయమే హీరో, హీరోయిన్ కెరీర్‌ను పూర్తిగా మార్చేస్తుంది. అదే ఇప్పుడు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలో జరిగింది. వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోయినా, ‘లెనిన్’ సినిమా ఆమెకు కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ విజయంతో నిర్మాతలు, దర్శకుల దృష్టి ఆమెపై పడింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా మారిన భాగ్యశ్రీ… తాజాగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ విద్యార్థుల ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడుతూ, సినిమాల్లోకి రావాలనే తన నిర్ణయం వెనుక ఉన్న బాధలు, కుటుంబం నుంచి ఎదురైన వ్యతిరేకత గురించి ఆమె చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…
Bhagyashri Borse : ” నా తల్లి ” అంటూ.. ఎక్కి ఎక్కి ఏడ్చిన భాగ్యశ్రీ..!
Bhagyashri Borse పేదరికం నుంచి వెండితెర వరకు.. భాగ్యశ్రీ ప్రయాణం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జన్మించిన భాగ్యశ్రీ బోర్సే చిన్నతనం నుంచే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కుటుంబ పరిస్థితులు అంతగా బాగాలేకపోయినా, చదువుపై దృష్టి పెట్టి తన కలలను వదులుకోలేదు. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో కుటుంబం కష్టాల్లో పడిందని, ఆ రోజుల్లో ఎదుర్కొన్న పరిస్థితులు తన జీవితాన్ని మార్చేశాయని ఆమె తెలిపారు. ఎవరి ముందు తండ్రి తలవంచకుండా ఉండాలనే ఆలోచనతోనే తాను కష్టపడి చదివి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు.మోడలింగ్‌లో మంచి గుర్తింపు రావడంతో సినీ అవకాశాలు వరుసగా వచ్చాయి. హిందీ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. రవితేజ సరసన నటించిన ‘మిస్టర్ బచ్చన్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ఆమె గ్లామర్, నటనకు మంచి ప్రశంసలు లభించాయి.ఆ తర్వాత విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, విజయాలు మాత్రం దూరంగా నిలిచాయి. దీంతో కొంతకాలం ఆమెపై ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర కూడా పడింది.
‘అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది’.. భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాల్లోకి రావాలనే తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదని భాగ్యశ్రీ తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు తన అక్క కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని చెప్పారు. అయితే నటిగా ఎదగాలనే కలను వదులుకోకుండా ఆడిషన్లకు హాజరవుతూ ముందుకు సాగానని వెల్లడించారు. ఆ విషయం ఇంట్లో తెలియడంతో తన తల్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని చెప్పారు. “అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది. దాదాపు ఆరు నెలల పాటు నాతో మాట్లాడలేదు. ఆ రోజులు నాకు చాలా బాధాకరంగా గడిచాయి. అయినప్పటికీ నా లక్ష్యాన్ని వదులుకోలేదు. ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తానని నమ్మాను” అని భాగ్యశ్రీ భావోద్వేగంతో చెప్పారు.
తాజాగా ‘లెనిన్’ సినిమా విజయంతో తనపై ఉన్న అన్ని విమర్శలకు సమాధానం లభించిందని ఆమె పేర్కొన్నారు. సక్సెస్ మీట్‌లో కూడా “ఇకపై నన్ను ఐరన్ లెగ్ అనొద్దు” అంటూ కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండగా, ఆమె కెరీర్ వేగంగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కుటుంబం కూడా అంగీకరించని సినీ ప్రయాణం, ఇప్పుడు విజయంతో కొత్త మలుపు తిరిగిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







