Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ స‌ర‌స‌న క్రేజీ భామ‌కి ఛాన్స్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: November 20, 2024, 9:04 pm
  •  Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ స‌ర‌స‌న క్రేజీ భామ‌కి ఛాన్స్..!

Bhagyashri Borse : టాలీవుడ్ Tollywood ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని Ram Pothineni కి ఇస్మార్ట్ శంకర్ చిత్రం త‌ర్వాత ఒక్క హిట్ ప‌డ‌లేదు. ఆయ‌న స‌రైన హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ప్ర‌స్తుతం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్‌ విడుదల చేసిన ప్రీ లుక్‌లో సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు రామ్‌.ఇక మాస్ మాహారాజా రవితేజ Ravi Teja సరసన మిస్టర్ బచ్చన్ mr bachchan Movie సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది భాగ్య శ్రీ బొర్సే. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Bhagyashri Borse క్రేజీ ఆఫ‌ర్..

ఈ సినిమా విడుదలకు ముందే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు.ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. RAPO 22 పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.అందమైన ప్రయాణంలో భాగమవుతున్న భాగ్యశ్రీబోర్సేకు స్వాగతం పలుకుతూ మేకర్స్‌ విడుదల చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్‌ హౌజ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ స‌ర‌స‌న క్రేజీ భామ‌కి ఛాన్స్..!

Bhagyashri Borse : ఎనర్జిటిక్ జోడి..రామ్ స‌ర‌స‌న క్రేజీ భామ‌కి ఛాన్స్..!

రవితేజ నటించిన మిస్టర్‌ బచ్చన్‌తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన భాగ్య శ్రీ బోర్సే.. ఈ సినిమాలో అందాలు ఆరబోసినా బాక్సాఫీస్ వద్ద సినిమా ఢీలా పడిపోయింది. మరి రామ్‌ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.ఈ అమ్మడు సోషల్ మీడియాలో Socila Media అంతగా యాక్టివ్ గా కనిపించదు. ఎప్పుడో ఒకసారి క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.కాని క‌నిపించిన ప్ర‌తి సారి కూడా త‌న క్యూట్ పిక్స్ తో కేక పెట్టిస్తుంటుంది. Ram Pothineni

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Chandrababu : బీసీ సంక్షేమంలో చంద్రబాబు మార్క్.. 34 శాతం రిజర్వేషన్ల హామీతో వైసీపీకి భారీ చెక్..?"

  2. "Ranabaali : తెలంగాణ హీరో రాయలసీమ యాసను ఎలా పట్టుకున్నాడు? విజయ్ దేవరకొండ సంచలన ప్రయోగం వెనుక సీక్రెట్ ఇదే!"

  3. "AP Cabinet Meeting : స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. విపక్షాలకు మైండ్ బ్లాక్..!"

  4. "Vijay Tvk : విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులో పెను భూకంపం.. ఎవరి కొంప మునుగుతుందో తెలిస్తే షాక్..!"

  5. "Karthika Deepam 2 Today Episode October 10th : తాతను గెలిపించిన కార్తీక్.. మాలిని టిఫిన్ బండికి షాక్!"

  6. "India vs West Indies : మా ఓట‌మికి కార‌ణం ఆ ఇద్ద‌రే.. శ్రేయస్ అయ్యర్ ..!"

  7. "Avocado Juice : ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారా? అవకాడో జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp