Big Boss 5 Telugu : అతడికి ఐ లవ్ యూ టూ చెప్పిన శ్రియా.. బిగ్ బాస్ 5 తెలుగు..!

Authored By mallesh | The Telugu News | Published on: November 1, 2021, 7:15 am

Big Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోలిస్తే చాలా భిన్నంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కాగా, ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ను సర్‌ప్రైజ్ చేసేందుకుగాను చాలా మంది గెస్టులు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, నితిన్, నభా నటేశ్, తమన్నా తదితరులు వచ్చేయగా, తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ టీమ్, సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్, సుమ తదితరులు వచ్చారు.

big boss 5 telugu Today promo

big boss 5 telugu Today promo

ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేయగా, అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సదరు ప్రోమోలో జెస్సీని పోల్‌గా ఊహించుకుని యాంకర్ రవి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఆ డ్యాన్స్‌ను చూసి బిగా బాస్ వ్యాఖ్యాత అక్కినేని నాగార్జున, సీనియర్ హీరోయిన్ శ్రియా నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్‌కు శ్రియా ఐ లవ్ యూ టూ చెప్పింది. ఇక ఆ తర్వాత ‘మంచి రోజులు వచ్చాయి’ ఫిల్మ్ హీరో సంతోశ్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

Big Boss 5 Telugu : కంటెస్టెంట్స్‌పై డైరెక్టర్ మారుతి పంచ్‌లు..

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

ఈ క్రమంలోనే సినిమా డైరెక్టర్ మారుతి కంటెస్టెంట్స్ పై పంచ్‌లు వేశారు. యాంకర్ సుమ కూడా కంటెస్టెంట్స్‌ను పలుకరించేందుకు రాగా, చివరలో బిగ్ బాస్ గత సీజన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన సోహెల్, అరియానా కనిపించి సందడి చేశారు. ఈ సందర్భంగా సోహెల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp