Home » Entertainment » Big Breaking Senior Actor Chalapathi Rao Dies Of Heart Attack
Entertainment

Big Breaking : సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: December 25, 2022 9:24 am
Advertisement

Big Breaking : ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 1200 కు పైగా సినిమాలలో నటించిన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేయడం జరిగింది. కెరియర్ ప్రారంభంలో విలన్ పాత్రలో మెప్పించిన చలపతిరావు ఆ తర్వాత.. రకరకాల పాత్రలు చేసి అన్నిటిలో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పామూరు మండలంలోని బలిపారు.

Advertisement

నాన్న పేరు మనియా. అమ్మ వీయమ్మ. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఆడపిల్లలు అమెరికాలో ఉంటారు. చలపతిరావు అబ్బాయి రవిబాబు ఇండస్ట్రీలో నిర్మాతగా మరియు నటుడిగా రాణిస్తున్నారు. గత కొంతకాలంగా చలపతిరావు నటనకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈరోజు ఉదయం గుండెపోటుకు గురై తుది శ్వాస విడిచారు. చలపతిరావు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఏడాదిలో చాలామంది ప్రముఖ నటులు మరణించారు.

Big Breaking senior actor Chalapathi Rao dies of heart attack

Advertisement

సెప్టెంబర్ నెలలో సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. రెండు రోజుల క్రితం నవరస నటసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది. కైకాల మరణం మరువకముందే ఈరోజు సీనియర్ నటుడు చలపతిరావు ఉదయం కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చలపతిరావు మరణం పట్ల ఇండస్ట్రీ ప్రముఖులు మరియు పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి