Home » Entertainment » Big Issue Happened On Katrina Kaif Marriage
Entertainment

Katrina Kaif : క‌త్రినా కైఫ్‌ పెళ్లిలో కుర్చీలు, చెప్పుల‌తో కొట్టుకున్న అతిథులు.. ఏం జ‌రిగిందో చెప్పిన క్యాట్

Authored By
Sam C
The Telugu News | Published on: November 10, 2022, 5:40 pm
Advertisement

Katrina Kaif : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు చాలా సుప‌రిచితం. నందమూరి నటిసింహం బాలయ్య, విక్టరీ వెంక‌టేష్‌ సరసన నటించి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం కత్రినా కైఫ్ నిత్యం యాక్టివ్ గానే ఉంటోంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది. గ‌త ఏడాది ఈ అమ్మ‌డు నటుడు విక్కీ కౌశల్‌ని పెళ్లాడి అందరికీ షాక్ ఇచ్చింది ఈ నటి. రాజస్థాన్‌లోని బార్వారాలో రాజ వైభవంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.ఈ పెళ్లి వేడుక‌లో పెద్ద గొడ‌వ జ‌రిగింద‌ట‌. తాజాగా ఈ విష‌యాన్ని క‌త్రినా పంచుకుంది. ‘‘పెళ్లి పీటలపై కూర్చుని అతిథుల వైపు చూస్తుండ‌గా, సడన్‌గా నా వెనుక నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వినబడ్డాయి. దాంతో ఏం జరిగింది? అని వెనక్కి తిరిగి చూసే స‌రికి అక్కడ నా సిస్టర్స్, విక్కీ కౌశల్ ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు. చివరికి కుర్చీలు, చెప్పుల్ని ఒకరిపై మరొకరు విసురుకుని మరీ తిట్టుకున్నారు. కానీ నేను ఆ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లలేకపోయా. ఆ తర్వాత ఆ గొడవలో ఎవరు గెలిచారో అడగడం మాత్రం మరిచాను’’ అని కత్రినా కైఫ్ నవ్వేసింది.

big issue happened on katrina kaif marriage

Advertisement

Katrina Kaif : అంత గొడ‌వ అయిందా?

పెళ్లి త‌ర్వాత ఈ అమ్మ‌డు ఏమాత్రం షూటింగ్ షెడ్యూల్ గ్యాప్‌ దొరికినా విదేశాలకి కత్రినా కైఫ్ వెళ్లిపోతోంది. ప్రస్తుతం కత్రినా కైఫ్ మేరీ క్రిస్‌మస్, టైగర్ 3 సి నిమాల్లో నటిస్తోంది. ఆమె భర్త విక్కీ కౌశల్ సామ్ బహదూర్, గోవిందా నామ్ మేరా సినిమాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి తర్వాత కూడా కత్రినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు తన వైవాహిక జీవితం కారణంగా, కొన్నిసార్లు ఆమె ఫ్యాషన్ కారణంగా మరియు కొన్నిసార్లు ఆమె చిత్రాల కారణంగా, నటి నిరంతరం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ అమ్మ‌డిని చాలా మంది క్యాట్ అని పిలుస్తుంటారు. తనకు ముందుగా క్యాట్ అనే పేరు పెట్టింది ప్రముఖ కొరియోగ్రాఫర్ అహ్మద్ ఖాన్ అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి