Home » Entertainment » Big News About Lavanya Tripathi And Varun Tej
Entertainment

Lavanya tripathi and Varun tej : ఎంగేజ్మెంట్ అయిపోయింది .. కొద్ది రోజుల్లో పెళ్లి .. వరుణ్ – లావణ్య త్రిపాఠి లకి బిగ్ న్యూస్ తెలిసింది !

Authored By
aruna
The Telugu News | Published on: June 19, 2023, 6:00 pm
Advertisement

Lavanya tripathi and Varun tej : టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల ప్రేమ గురించి అందరికీ ఆశ్చర్యం కలిగింది. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని ఎవ్వరికి తెలియదు. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. ఈ సినిమా టైంలో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అయినా ఎక్కడ కూడా వీళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు. ఎక్కడ తమ ప్రేమ గురించి బయటికి చెప్పలేదు. సాధారణంగా ఇలాంటి విషయాలు ఏదో ఒక రూపంలో బయటికి లీక్ అవుతూ ఉంటాయి. కానీ వీళ్ల విషయంలో అది జరగలేదు. కనీసం ఫ్రెండ్స్ అని కూడా ఎక్కడా చెప్పలేదు.

Advertisement

రీసెంట్గా ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట బయట కూడా ఎక్కువ కనిపించడం లేదు. ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. ముందు నుంచి లావణ్య, వరుణ్ తమ ప్రేమ విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచారో, అప్పుడు ఎలా ఉన్నారో, ఎంగేజ్మెంట్ తర్వాత కూడా అలానే సైలెంట్ గా ఉంటున్నారు. కలిసి తిరగడానికి, వెకేషన్ లకు వెళ్లడానికి రైట్స్ వచ్చిన కామ్ గానే ఉంటున్నారు. ప్రేమ విషయాన్ని ఎంత సీక్రెట్ గా ఉంచారో నిశ్చితార్థం తర్వాత అలాగే మెలుగుతున్నారు . ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. ప్రస్తుతం లావణ్య రెండు వెబ్ సిరీస్ లు, ఒక తమిళ సినిమాలో నటిస్తుంది.

Big news about Lavanya tripathi and Varun tej

Advertisement

వరుణ్ తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్న వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడానికి పలు చానల్స్ వెంబడించిన వీళ్లు దానిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. మరీ పెళ్లికిముందు ఇలాంటి పనులు సరి కాదని పాల్గొనడం లేదని సిగ్గు, మొహమాటంతో ముందే ఇవన్నీ ఎందుకని వెనక్కి తగ్గుతున్నారా? తెలియదు గానీ మీడియా నుంచైతే దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. వరుణ్ చాలా మొహమాటస్తుడు. అలాంటి వరుణ్ ని ప్రేమ విషయం గురించి అడిగితే ఏం చెబుతాడు. ఆ కారణంగానే వరుణ్ మీడియాకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి