
బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమా కి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి టన్నుల్లో ఉత్సాహాన్ని నింపింది. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యాం సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా అనేక కారణాల వల్ల ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి లాక్ డౌన్ సమయంలో అన్ని సినిమాల షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇతర దేశాలలో షూటింగ్ జరపడానికి మేకర్స్ ధైర్యం చేయలేకపోయారు. కాని ప్రభాస్ మాత్రం రాధే శ్యాం సినిమా కోసం ధైర్యం చేసి ఇటలీ వెళ్ళి 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చాడు.
ఇక రాధే శ్యాం సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. చివరి దశకి చిత్రీకరణ చేరుకుందట. దాంతో ఇప్పుడు మేకర్స్ రాధే శ్యాం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ తో పాటు ప్రమోషన్స్ అండ్ రిలీజ్ డేట్ విషయంలో చర్చలు జరుపుతున్నారట. ఈ క్రమంలో న్యూ ఇయర్ నుంచి రాధే శ్యాం సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఇప్పటికే రాధే శ్యాం సినిమా నుంచి రిలీజ్ చేసిన టైటిల్ అండ్ ప్రభాస్ – పూజా హెగ్డే ఫస్ట్ లుక్ పోస్టర్ .. ఆ తర్వాత రిలీజ్ చేసిన బీట్స్ ఆఫ్ రాధే శ్యాం.. అలాగే ప్రభాస్.. విక్రమాదిత్య లుక్.. పూజా హెగ్డే ప్రేరణ లుక్ .. సినిమా మీద ఊహించని విధంగా అంచనాలను పెంచాయి.
ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే విధంగా ప్రభాస్ .. రాధే శ్యాం ప్రమోషన్స్ ని మొదలు పెట్టబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ కి పోటీగా దింపే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఎన్.టి.ఆర్ – రాం చరణ్ హీరోలుగా ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ఆర్ ఆర్ ఆర్ ని రాజమౌళి జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
అయితే రాధే శ్యాం కూడా జూన్ లోనే రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యాం వర్సెస్ ఆర్ ఆర్ ఆర్ కాబోతోందని తెలుస్తోంది. అంటే ఒకే రోజు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నాయట. చూడాలి మరి ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.