Home » Entertainment » Rashmika Madanna Got Great Opportunity With Amithab Bachhan
Entertainment

అమితాబ్ బచ్చన్ తో రష్మిక మందన్న ఇలాంటి ఛాన్స్ ఏ హీరోయిన్ కి దక్కదట ..!

Authored By
vamana sai
The Telugu News | Updated on: December 27, 2020, 12:51 pm
Advertisement

అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కోసం బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే కాదు మన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో మెగాస్టార్ గా .. బిగ్ బి గా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలిచిన శిఖరం లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం ఊహిస్తారు. ఇప్పటికే టాలీవుడ్ లో కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళతో అమితాబ్ బచ్చన్ నటించడం గొప్ప విషయం. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ సినిమా లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కబోయే 50 వ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా లో నటించేదుకు అమితాబ్ బచ్చన్ కి దాదాపు 20 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ తో కలిసి దీపిక పదుకొణె, తాప్సీ హీరోయిన్స్ లాంటి నటించి క్రేజీ స్టార్స్ గా పాపులారిటీని సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ ని సంపాదించుకోవడానికి కారణం అమితాబ్ బచ్చన్ అని ఖచ్చితంగా చెప్పాలి. తాప్సీ.. అమితాబ్ బచ్చన్ తో పింక్ అన్న సెన్షేనషల్ హిట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే కాంబినేషన్ లో బద్లా అన్న సినిమా చేసి సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న కి బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చన్ తో నటించే అవకాశం వచ్చిందట.

Advertisement

బాలీవుడ్ లో సంచనల దర్శకుడిగా పేరు సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ వికాస్ భల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. 2021 లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ” డెడ్లీ ” అన్న టైటిల్ ని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇక ఈ సినిమా కథాంశం తండ్రీ – కూతురు మధ్య సాగుతుందని సమాచారం. ఇలాంటి అద్భుతమైన కథలో అమితాబ్ బచ్చన్ తో నటించే అకవాశం దక్కించుకున్న రష్మిక మందన్న ఆనందానికి అవధులు లేవని ఫుల్ జోష్ లో ఉందని చెపుకుంటున్నారు. ఇక ఇప్పటికే సిద్దార్థ్ మల్‌హోత్రా కి జంటగా ” మిషన్ మజ్ఞు ” అన్న సినిమా చేస్తోంది. కాగా అమితాబ్ తో రష్మిక మందన్న నటించే సినిమా అవకాశం మరే హీరోయిన్ కి దక్కదని చెప్పుకుంటున్నారట.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి