Bigg Boss 5 Telugu : వామ్మో.. బిగ్‌ బాస్‌ ఫినాలే ప్రోమోలో ఊహించని గెస్టులు… బద్దలవనున్న టీఆర్‌పీ రికార్డులు..!

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ ఎవరో తేలడానికి మరో కొద్ది గంటలే మిగిలి ఉంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ ఏపిసోడ్ ను తిలకించడానికి బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం కాబోతున్న ఈ భారీ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ప్రోమో రీలిజ్‌ అయిన కాసేపటికే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని పూర్తి ఏపిసోడ్‌ పై భారీ అంచనాలను నెలకొల్పింది. ప్రోమో ఇంతలా హైలేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏమిటంటే… షోకు హాజరు కాబోతున్న పలువురు ప్రముఖ స్టార్లు నేడు ఒకే వేదికపై సందడి చేస్తుండటమే. మాజీ కంటెస్టెంట్లతో పాటు టాలీవుడ్ మాత్రమే కాక బాలీవుడ్ నుంచి సైతం అతిథులు హాజరవుతుండగా… ఓ కంటెస్టెంట్‌ మాత్రం ప్రోమోలో మిస్స్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Bigg Boss 5 Telugu : ఊహించని గెస్టులతో బద్దలవనున్న టీఆర్‌పీ రికార్డులు…!

ఆర్ ఆర్ ఆర్‌ దర్శకుడు రాజమౌళితో ఎంట్రి ఇచ్చిన నాగ్… ప్రోమో నిండా గెస్టులతో షోకు భారీ హైప్ తీసుకొచ్చారు. బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ రణబీర్, నటి అలియాభట్‌‌లు షో లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు.. నటుడు జగపతిబాబుతో పాటు నటి శ్రేయ, పలువురు ఐటమ్ తారలు, సింగర్ రాహుల్ సిప్లి గంజ్ నాటు నాటు సాంగ్ తో రచ్చ చేస్తూ ప్రోమోలో కనిపించారు. అనంతరం హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన పుష్ప బృందం… సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికతో నాగ్‌ తో పాటు కంటెస్టెంట్లతో కలిసి కాసేపు హాంగామా చేశారు. ఇక చివరగా శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్స్‌ లో భాగంగా.. నానీ, సాయి పల్లవి, కృతి శెట్టి కూడా బిగ్ బాస్ హౌస్‌లోపలికి వెళ్లి సందడి చేశారు.

Bigg Boss 5 Telugu finale promo creates hype on episode

Bigg Boss 5 Telugu : సరయు మిస్స్ అయిందా.. మిస్స్ చేశారా…?

అయితే షో నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చిన మాజీ ఇంటి సభ్యులంతా ప్రోమోలో కనిపించగా… ఒక్క సరయు మాత్రం కనిపించకపోవడం గమనార్హం. ఈ సీజన్‌లో మొదటి ఎలిమినేషన్‌లో భాగంగా హౌస్ నుంచి నిష్క్రమించిన సరయు.. గైర్హాజరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ టీం పై కోపంతో రాలేదని కొంతమంది అంటూ ఉండగా… ప్రోమో షూట్ అప్పటికీ తను హాజరు కాలేకపోయి ఉండవచ్చునని లేదా మరేదో బిజీ షెడ్యుల్ కారణంగా రాలేకపోయి ఉండవచ్చునని అంటున్నారు. అయితే నాలుగో సీజన్‌ లో ప్రోమోలో కూడా న్యూస్ రీడర్ దేవి నాగవల్లి ఇలాగే ప్రోమోలో మిస్ అవ్వగా.. ఎపిసోడ్‌లో మాత్రం కనిపించి షాక్ ఇచ్చింది. ఈసారి సరయు కూడా ఇలాగే ఝలక్ ఇవ్వనుందా.. లేక మొదటి సీజన్ లో ముమైత్ ఖాన్ మాదిరి షోకు గైర్హాజరు కానుందా అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే సన్నీ విజేతగా నిలుస్తున్నాడంటూ సోషల్ మీడియా కోడై కూస్తుండగా.. అసలు విజేత ఎవరో తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాలి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago