Bigg Boss 5 Telugu : నామినేషన్ జోరు.. మూడో వారంలో ఎవరెవరు అయ్యారంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : నామినేషన్ జోరు.. మూడో వారంలో ఎవరెవరు అయ్యారంటే?

 Authored By bkalyan | The Telugu News | Updated on :20 September 2021,7:59 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో రెండు వారాలు విజయవంతంగా గడిచాయి. ఇక మూడో వారం సోమవారం ఎపిసోడ్ నుంచి ప్రారంభం కానుంది. సోమవారం ఎపిసోడ్ అంటే అందరికీ మజా ఉంటుంది. ఎప్పుడు గొడవలు అయినా కాకున్నా కూడా నామినేషన్స్ వద్దకు వచ్చే సరికి కచ్చితండగా వాగ్వాదాలు అవుతుంటాయి. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ఉమా దేవీ దారి తప్పి నోటి వెంటబూతులు పలకడంతోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అలా నామినేషన్స్ ప్రక్రియను ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సి వస్తుంటుంది.

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

 

 

మూడో వారం నామినేషన్ ప్రక్రియ అదిరిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో ఈ సారి మళ్లీ గత వారంలో నామినేట్ అయినట్టు సభ్యులే ఉన్నట్టు లీకులు వస్తున్నాయి. ప్రతీ సారి కాజల్ నామిటన్ అవుతుందని అందరూ ముందే ఊహించారు.

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

వారి ఊహకు తగ్గట్టే ఈ సారి కూడా కాజల్ నామినేషన్‌లోకి వచ్చిందని తెలుస్తోంది. ఉన్నదే 17 మంది అందులో 7 మంది నామినేషన్‌లోకి వచ్చారంని తెలుస్తోంది. అయితే ఆ 7 మంది పేర్లు ఏంటో ఓ సారి చూద్దాం. నామినేషన్ ప్రక్రియ మాత్రం మంచి రసవత్తరంగా జరిగిందని తెలుస్తోంది.

మూడో వారం నామినేషన్ లిస్ట్..

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

Bigg Boss 5 Telugu third Week Nominations List Buzz

లోబో, సిరి, షన్ను, సన్నీ, ఆర్జే కాజల్, శ్వేత, మానస్ ఇలా అందరూ కూడా నామినేషన్‌‌లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సుత్తి పట్టి ఒక్కొక్కరి ఫ్రేములను పగలగొట్టే టాస్క్‌తో నామినేషన్లు పెట్టినట్టున్నాడు. మొత్తానికి ఈ మూడో వారం మాత్రం మంచి జోరు మీదున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇందులో ఈ సారి శ్వేత, సన్నీలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేలానే కనిపిస్తున్నారు. అయితే మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. మూడో వారం మాత్రం ఇంకా గొడవలు జరిగేలా ఉన్నాయి.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది