Bigg Boss 5 Telugu : సంక్రాంతి స్పెషల్.. సన్నీ మానస్ హల్చల్

Advertisement

Bigg Boss 5 Telugu : బుల్లితెరపైనే అసలు పండుగ వాతావరణం ఉంటుంది. పండుగలు వస్తున్నాయంటే చాలు లీడింగ్ చానెల్స్ స్పెషల్ ఈవెంట్లతో రెడీ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు వెళ్లి ఎంజాయ్ చేసేంత లేదు. దీంతో అందరూ టీవీలకే అతుక్కుపోతారు. దీంతో టీవీ చానెళ్లు వెరైటీ ఈవెంట్లతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంటారు.

Advertisement

ఈ క్రమంలో ఈ సంక్రాంతికి స్పెషల్ ఈవెంట్లు కూడా సిద్దమయ్యాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఈటీవీ, మల్లెమాల చాలా ముందుంది. సంక్రాంతి ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలను ఇది వరకే విడుదల చేశారు. అయితే స్టార్ మా మాత్రం కాస్త ఆలస్యంగా బరిలోకి దిగింది. ఇందులో బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొస్తారని అందరూ ముందుగానే ఊహించారు.

Advertisement
VJ Sunny Maanas In Star Maa Sankranthi 2022 Event
VJ Sunny Maanas In Star Maa Sankranthi 2022 Event

Bigg Boss 5 Telugu : సన్నీ, మానస్ స్టెప్పులు..

అందరూ అనుకున్నట్టుగానే బిగ్ బాస్ కంటెస్టెంట్లతోనే ఈ ఈవెంట్ రెడీ చేశారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ కనిపించాడు. అతనితో పాటు మానస్ కూడా వచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి నాటు నాటు అంటూ వేసిన స్టెప్పులు ఈ చిన్న ప్రోమోలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ సంక్రాంతికి మాత్రం బుల్లితెరపై మంచి వినోదం రెడీగా ఉందన్నమాట.

Advertisement
Advertisement