Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షోలో నామినేషన్లు, ఎలిమినేషన్లు తప్పవన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం నాటి ఎపిసోడ్ మంచి ఊపు మీదుంటుంది. ఎందుకంటే ఆ రోజు నామినేషన్ల పేరుతో ఒకరిపై ఒకరు తమ తమ రాగద్వేషాలు, పగలను తీర్చుకుంటారు. కసితీరా తిట్టుకుంటారు. మాటామాటా పెరుగుతుంది. గొడవలు జరుగుతుంటాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం అందరికీ షాక్ ఇచ్చినట్టు అయింది. అది బిగ్ బాస్ కంటెస్టెంట్లకు హ్యాపీగా ఉంటే.. ఆడియెన్స్‌కు చికాకుగా అనిపించింది. కష్టపడి జనాలు వేసిన ఓట్లకు విలువ లేకుండా పోయింది.
బిగ్ బాస్ ఇంట్లో మొదటి వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున సింపుల్‌గా తేల్చి చెప్పేశాడు. అయితే ఇప్పుడు రెండో వారానికి సంబంధించిన నామినేషన్‌ల ప్రోమోలు వచ్చాయి. ఇందులో ఒక్కొక్కరు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరికి మనసులో ఉన్న కోపాలను, ద్వేషాలను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ క్రమంలో ఆదిరెడ్డి ఆరోహిల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. తనతో అంతగా అటాచ్ అవ్వలేదంటూ ఆదిరెడ్డిని ఆరోహి నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆట ఆడని వాళ్లని నామినేట్ చేస్తావా?
నీకు అటాచ్ కాలేదని నామినేట్ చేస్తావా? అని ఆరోహిని అడిగేశాడు ఆదిరెడ్డి. అయితే ఆడని వాళ్లని నామినేట్ చేస్తాను అని ఆరోహి అంటుంది. నువ్ ఎక్కడ ఆడావ్? అని ఆదిరెడ్డిని ఆరోహి ప్రశ్నిస్తుంది. నీ కంటే బాగానే ఆడానులే అని ఆదిరెడ్డి అంటాడు. నాకంటేనా? అని ఆరోహి ఓ వెకిలి నవ్వు నవ్వేస్తుంది. నువ్ ఏం వెలగబెట్టావ్ అన్నట్టుగా ఆదిరెడ్డి దారుణంగా వెక్కిరించేశాడు. అయితే ఇప్పటి వరకు వచ్చిన రెండు ప్రోమోల్లో గలాట గీతూ రేవంత్ కీర్తి భట్ విషయాలే ఎక్కువగ వైరల్ అవుతున్నాయి. మంచితనం ముసుగు వేసుకున్నాడని షానీని అందరూ నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. తనకు కోపం తెప్పించండి.. చిరాకు పెట్టండి అప్పుడు కోప్పడతాను అని షాని అనేశాడు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.